కథను జడ్జ్ చేయడంలో… తర్వాత కథకు, అందులో నటించే హీరో మార్కెట్ పరిధికి మించి బడ్జెట్ ఎక్కువ కాకుండా సినిమా నిర్మించడంలోనూ సురేష్ బాబును మించినవారు మరొకరు లేరని ఇండస్ట్రీ జనాలు ఆఫ్ ది రికార్డ్ చెబుతుంటారు. క్యాస్టింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీలు రచించడంలోనూ, సరైన సమయంలో విడుదల చేయడంలోనూ సురేష్ బాబు దిట్ట. తమ్ముడు వెంకటేష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి ఆయన ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. అందులో హీరో కంటే కాస్త నిడివి తక్కువ వున్న పాత్ర ఒకటి వుంది. నిడివి తక్కువే కానీ.. కథలో చాలా కీలకమైన పాత్ర అట!
అయితే సూర్య… లేదంటే అతని తమ్ముడు కార్తీ… తమిళ సోదరులు ఇద్దరిలో ఎవరో ఒకరి చేత ఆ పాత్ర చేయించాలని సురేష్ బాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ కుదరకపోతే తమిళ హీరోలు ఇంకెవరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. దీని వెనుక రెండు కారణాలు వున్నాయి. ఒకటి… తమిళంలో సినిమాను మార్కెట్ చేసుకోవచ్చు. రెండోది… ముఖ్యమైనది… వెంకీతో తెలుగులో మహేష్ బాబు, రామ్, శ్రీకాంత్ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మేనల్లుడు నాగచైతన్యతో చేస్తారు. సినిమాకి కొత్త లుక్, ఫ్రెష్ కాంబినేషన్ ఫీల్ తేవాలంటే ఆల్రెడీ నటించిన హీరోలు కాకుండా కొత్త హీరో కావాలి. అందుకని తమిళనాట హీరోలపై చూస్తున్నారట!!