ఓ తమిళ్ ఎఫ్ఎం స్టేషన్లో లక్ష్మీ మంచు సందడి చేస్తున్నారు. అయితే… అది సినిమా పబ్లిసిటీ కోసం కాదు. షూటింగ్ కోసమే! హిందీ హిట్ ‘తుమ్హారీ సులు’కి రీమేక్‌గా రూపొందుతోన్న తమిళ్ సినిమా ‘కాట్రిన్ మొళి’. విద్యా బాలన్ చేసిన లేట్ నైట్ ఆర్.జే. (రేడియో జాకీ) పాత్రను తమిళంలో జ్యోతిక చేస్తున్నారు. ఎఫ్ఎం స్టేషన్ బాస్ పాత్రలో లక్ష్మీ మంచు కనిపించనున్నారు. హిందీలో ఈ పాత్రను నేహా ధూపియా చేశారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ రోజు నుంచి లక్ష్మీ మంచు యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చెన్నైలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధామోహన్. తమిళంలో లక్ష్మీ మంచుకి మొదటి సినిమా ఇది. చిన్నప్పుడు కొన్ని రోజులు చెన్నైలో పెరగటం వలన ఆమెకు తమిళం వచ్చు. అందువల్ల, షూటింగ్, డబ్బింగ్ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది వుండకపోవచ్చు. ఇక, తెలుగు సినిమాల విషయానికి వస్తే… లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ తర్వలో విడుదల కానుంది.