జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికారికమైన ప్రజాపోరాటయాత్రను… విజయనగరం జిల్లా శృంగవరపు కోట నుంచి రెండో తేదీన పునంప్రారంభించారు. రంజాన్ సందసందర్భంగా..తన సెక్యూరిటీ సిబ్బందికి సెలవులు ఇవ్వాలన్న కారణంగా.. యాత్రను వాయిదా వేసిన పవన్.. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేసి… ఎట్టకేలకు… ఇరవై రోజుల తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఎస్ కోటలో జరిగిన సభలో..తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరడం హైలెట్ గా మారింది. తనకు చాన్స్ ఇస్తే చిరస్థాయి పాలన అందిస్తానని చెప్పుకొచ్చారు. దానికి ఆయన చెప్పుకున్న కారణం తాను దోపిడీలు చేయనని… లంచాలు తీసుకోనని. ఇది ఒక్క టి తప్ప.. తన పరిపాలనా సామర్థ్యం ఏమిటో… ఐదు కోట్ల ఆంధ్రుల సంక్షేమాన్ని.. ఏపీ అభివృద్ధిని ఎలా సమన్వయం చేసుకోగలనో ఒక్క ముక్క చెప్పలేదు.
కానీ పవన్ అవగాహనా రాహిత్యం మాత్రం మళ్లీ బయటపడింది. ఉత్తరాంధ్రను వాసులపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చెప్పేందుకు.. పొరుగు రాష్ట్రం హైదరాబాద్ విషయాలనూ .. ఏపీ ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఉత్తరాంధ్రకు చెందిన వివిధ వెనుకబడిన వర్గాలయిన 23 కులాల్ని బీసీ జాబితా నుంచి తొలగించారు. మళ్లీ బీసీల్లో చేర్చడానికి కేసీఆర్ అంగీకరించలేదు. చివరికి.. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. తను పార్టీ మారడానికి ఈ కులాలనే కారణంగా చూపించారు. ఆ కులాలన్నింటిని బీసీల్లో చేరుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు. అది పూర్తిగా తెలంగాణ అంతర్గత వ్యవహారం. దానికి ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తారు..?.
దాన్ని కూడా .. చంద్రబాబుపైకి నెట్టేసి…ఆయన పట్టించుకోవడం లేదని.. ఆయన చూపిస్తున్న వివక్షకు ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. నిజానికి ఇప్పుడు కేసీఆర్ తో పవన్ కల్యాణ్ కే దగ్గర సంబంధాలున్నాయి. ఈ సమస్య ఆయనకు ఎప్పుడు తెలిసిందో కానీ… ముందుగా పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు కదా…!. నేనే కేసీఆర్ వద్దకు వెళ్తానని చెప్పడం దేనికి. గతంలో ఇలాంటి మాటలు ఎన్నో చెప్పారు పవన్… ఇది కూడా అలాంటిది కాదని గ్యారంటీ ఏమిటి..?
పోలవరం, పట్టిసమ ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులుంటాయి కానీ.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుకు ఉండవా అని మరో విమర్శ కూడా చేశారు పోలవరం నీరు ఉత్తరాంధ్ర వరకూ వస్తాయని తెలియదా.. తెలిసినా… ఏదో ఆ ప్రాజెక్టు.. గోదావరి జిల్లాలో ఉంది కాబట్టి.. అక్కడి వారికే పరిమితమనే చెబుతామనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పవన్ ప్రసంగాలు చూసేవారి..ఆయనతో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదన్న భావన వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్..తన ప్రసంగాలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..
——- సుభాష్