తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ కు ముందస్తు వచ్చినా రాకపోయినా…డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్లాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. డిసెంబర్ లో జరగనున్న రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రా,ష్ట్రాలతో పాటు తెలంాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం దాదాపు ఖాయమే. అందుకే .. తెలంగాణలో పొత్తు చర్చలు ఊపందుకున్నాయి. తాము బీజేపీ మినహా.. టీడీపీ, వామపక్షాలు, కోదండరాం పార్టీ టీజేఎస్ అన్నింటితో కలిసి మహాకూటమికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమర్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు. కచ్చితంగా పొత్తులతోనే వెళ్లాలని.. టీ టీడీపీ నేతలే కాదు.. చంద్రబాబు కూడా నిర్ణయించారు. ఒంటరిగా పోటీకి వెళ్తే… కమ్యూనిస్టుల్లా పరిస్థితి అయిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలున్నాయి. అయితే ఏ పార్టీ తో పొత్తు అన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే..టీడీపీకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత … టీడీపీతో పొత్తు కోసం.. అటు కాంగ్రెస్,.. ఇటు టీఆర్ఎస్ కూడా… ఆసక్తిరకంగా ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబుదే చాయిస్ కావొచ్చు. తెలంగాణలో టీడీపీ పొత్తుల గురించి క్లారిటీ రావాలంటే..జాతీయ రాజకీయాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీల కూటమి అంటూ ఏర్పడి.. దానితో కాంగ్రెస్ పార్టీకి కనీసం లోపాయికారీ అవగాహన అన్న ఉంటే.. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుకు రెడీగా ఉండొచ్చు.
కానీ టీడీపీ పుట్టింది.. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీదేనన్న వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు.. టీడీపీ నేతలు ఇప్పటికే దీనికి కౌంటర్ రెడీ చేశారు. తెలుగువారి ఆత్మగౌవరం కోసం పుట్టిన పార్టీ టీడీపీ.. అప్పుు తెలుగువారిని కాంగ్రెస్ అవమానించింది కాబట్టి .. కాంగ్రెస్ ను లక్ష్యం చేసుకున్నామంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్ లోకి బీజేపీ వచ్చిందంటున్నారు. ఇక టీఆర్ఎస్ తో పొత్తు వద్దనడానికి కూడా టీడీపీకి ఎలాంటి కారణాలు లేవు. నిజానికి ఎక్కువ మంది టీటీడీపీ నేతలు టీఆర్ఎస్ తో పొత్తు కోరుకుంటున్నారు. ఆ పార్టీతో జత కడితే.. కనీసం సీనియర్లుగా ఇప్పటికీ పార్టీలో ఉన్న పది మందికైనా అవకాశాలు వస్తాయన్న ఆలోచన. కానీ నేతలతో కిక్కిరిసిపోయిన టీఆర్ఎస్ .. టీడీపీకి ఎన్ని సీట్లివ్వగలదన్న సందేహం ఉంది.