మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్. ప్రభుత్వంలో లోటు పాట్లు ఎత్తి చూపాలి. అసలు లోటు పాట్లే లేని ప్రభుత్వం ఉండదు. వాటిని ఎత్తి చూపినప్పుడే పత్రిక విలువ పెరుగుతుంది. అలాంటి మీడియాలో.. అదీ ప్రతిపక్ష నేతకు చెందిన ప్రభుత్వ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపాల్సిన మీడియా… పూర్తిగా వేరే కోణాన్ని ఆవిష్కరిస్తుంది. చంద్రబాబు చేసే ప్రతి తప్పును ఎత్తి చూపించడం కరెక్టే కానీ.. చెప్పడానికి ఏమీ లేవన్నట్లు.. మాట తడబాటును కూడా బ్యానర్ వార్తలుగా రాసుకోవడం ఏమిటో… ఆ పత్రికను చదివేవారికి కూడా అర్థం కాని పరిస్థితి.
చంద్రబాబు పాలనా విధానాల్లో లోపాలుంటే.. సమర్థవంతంగా బయటపెట్టాల్సిన బృహత్తరమైన ప్రయత్నాలను… సాక్షి చేయాల్సింది. దురదృష్టవశాత్తూ … అది జరగడం లేదు. ఎక్కడైనా చంద్రబాబు ప్రసంగంలో మాట దొర్లకపోతుందా.. అన్వయదోషాలు.. వస్తే.. దాన్ని పట్టుకుని…. ఓ బ్యానర్ వార్త రాసేసుకుంటే సరిపోకపోతుందా అన్నట్లుగా… వ్యవహారం నడిచిపోతోంది. హోంగార్డులకు జీతాలు పెంచిన సందర్భంగా వారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు మాట్లాడారు. శాంతిభద్రతల్లో ఎంతో ముందు ఉందన్నారు. దీన్ని మరో కోణంలో ఆవిష్కరించి..బ్యానర్ వార్తగా రాసుకున్నారు.
చంద్రబాబు అలా అంటారని.. సాక్షి మీడియాను అమితంగా అభిమానించే.. వైసీపీ కార్యకర్తలు కూడా అనుకోరు. మాట దొర్లిందనే అనుకుంటారు. ఆ విషయం తెలియక కాదు… కానీ ఏదో ఒకటి అనాలన్న తాపత్రయమే సాక్షిది. ఇదంతా జగన్ మీడియా భావదారిద్ర్యం అనడం కన్నా… చంద్రబాబు పాలనలో సమర్థతను ప్రజలు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్న విశ్లేషణలున్నాయి. చంద్రబాబు పాలనలో తప్పులు చెప్పలేక.. ఆయన మాటల్లో ఉన్న వ్యాకరణ దోషాలను చెప్పుకుంటూ సాక్షి పాపేర్‌ను లాగించేస్తున్నారా అన్న అనుమానాలు కూడా మీడియావర్గాల్లో వస్తున్నాయి. ఈ విషయంలో సాక్షి యాజమాన్యం మరింత కేర్ తీసుకోవాల్సి ఉందేమో..?