ఈవారం విడుదల కావాల్సిన సినిమా ఒకటి వుంది. ఈ సినిమా మీద అంచనాల సంగతి ఎలా వున్నా హీరోకి ఈ సినిమా విజయం చాలా అవసరం. కానీ ఇలాంటి టైమ్ లో ఏమయిందో తెలియదు, ఇక పబ్లిసిటీ నా వల్ల కాదు అని నిర్మాత చేతులు ఎత్తేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కొత్తగా ప్రకటనలు కానీ, ఇతరత్రా వ్యవహారాలు కానీ తన వల్ల కాదని నిర్మాత కరాఖండీగా చెప్పేసినట్లు వినిపిస్తోంది.
దీంతో ఏం చేయాలో తెలియక హీరో మనుషులు తలపట్టుకున్నారని తెలుస్తోంది. పెద్ద హీరోలు లేదా కాస్త క్రేజ్ వున్న హీరోల సినిమాలకు పబ్లిసిటీలో సగం వృధానే వుంటుంది. సగం అవసరంమైన పబ్లిసిటీ వుంటుంది. మిగిలిన సగం, నెగిటివిటీ రాకుండా చూసుకోవడానికి ఖర్చు చేసే మొహమాటం పబ్లిసిటీ వుంటుంది. అసలే హీరోకి హిట్ లు లేవు. ఇప్పుడు ఈ సినిమా తేడా కొడితే, నెగిటివ్ పబ్లిసిటీ ఓ రేంజ్ లో వుంటుంది. అలా వుండకుండా వుండాలంటే, పబ్లిసిటీకి కాస్త ఖర్చు చేయాలి.
కానీ ఇక్కడే నిర్మాత చేతులు ఎత్తేసారు. దీంతో అవాక్కు కావడం హీరో మనుషుల వంతయింది. పైగా హీరో కూడా అంతే. సినిమా ఎలా వుంటే అలా వుంటుంది, పాజిటివ్ , నెగిటివ్ తనకు అనవసరం అనే టైపు. దాంతో ఏం చేయాలో తెలియక, ఆ మధ్య హీరో చేసిన ఓ కమర్షియల్ వెంచర్ లో వచ్చిన కాస్త అమౌంట్ వుంటే, దాన్ని పబ్లిసిటీ ఖర్చులకు వాడాలని చూస్తున్నారట. ఏమిటో పాపం, హీరో జనాలకు ఈ బాధలు.