త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక విషయం మీద తెగ హడావుడి జరుగుతోంది. సినిమా అంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అందుకోసం సీమ యాసలో ఫుల్ డైలాగులు వుంటాయి. ప్రత్యేకంగా వేరే వాళ్ల సహాయంతో త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్నారు. ఎన్టీఆర్ ఆ యాసలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఎవరి కథనాలు వారివి, ఎవరి వార్తలు వారివి.
కానీ అసలు విషయం ఏమిటంటే, అరవింద సమేత వీర రాఘవ చాలా వరకు హైదరాబాద్ నేఫథ్యంలోనే జరుగుతుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాంటిది మాత్రం సీమ నేపథ్యంలో వుంటుంది. ఆ ఎపిసోడ్ కాస్త చెప్పుకోదగ్గ నిడివిలోనే వుంటుంది కానీ, మరీ సినిమా అంతా ఆక్యుపై చేసేంత మాత్రం కాదట.
దసరా టార్గెట్ గా రెడీ అవుతున్న అరవింద సమేత సినిమా ఇప్పటికే ఆంధ్ర ఏరియా హక్కులు 40 కోట్ల రేషియోలో అమ్మేసారు. అలాగే ఓవర్ సీస్ హక్కులు ఇచ్చేసారు. ఇక నైజాం, సీడెడ్ హక్కులు ఇవ్వాల్సి వుంది.