ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ ఎలా ఉండబోతున్నాడు? ఆయన పోలికలు ఏ మాత్రం కనిపించనున్నాయి…? ప్రస్తుతం బాలయ్య అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సరిగ్గా 5 గంటలకు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. దాదాపుగా పౌరాణిక గెటప్‌లోనే ఈ లుక్ ఉండబోతోందని సమాచారం. ఖాకీ దుస్తుల్లోనూ కొన్ని ఫొటో షూట్లు జరిపారు. వాటిలో ఒక లుక్‌ని వదిలే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అంతకంటే ముందే నాగార్జున – నానిల మల్టీస్టారర్ లుక్ బయటకు రానుంది. ఈరోజు సాయింత్రం 4 గంటలకు ఈ లుక్ విడుదల చేయనున్నారు. మల్టీస్టారర్ కాబట్టి.. నాగ్, నానిలను జాయింటుగా చూసే అవకాశం ఉంది. మొత్తానికి రెండు క్రేజీ సినిమాల లుక్స్ ఒక గంట వ్యవధిలో రాబోతున్నాయి. ఫ్యాన్స్‌కి పండగే. మరి ఈ రెండు లుక్కుల్లో దేనికి ఎక్కువ మార్కులు పడతాయో చూడాలి.