మారుతి డైరక్షన్ లో నాగ్ చైతన్య సినిమా శైలజరెడ్డి అల్లుడు. ఈ సినిమా విడుదలకు ఫిక్స్ చేసుకున్న డేట్ ఆగస్టు 31. చందు మొండేటి డైరక్షన్ లో చైతన్య చేస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమా అలా అలా వెనక్కు జరుగుతూ వస్తోంది. దీంతో రెండు సినిమాల విడుదల డేట్లు సమస్యగా మారాయి. ఈ విషయంలో నాగ్ చైతన్య ఏమీ చేయలేక, తండ్రి నాగార్జునకు అప్పగించాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
నాగార్జున సినిమా చూడడం, రెండురోజుల్లో మళ్లీ కూర్చుని, ఏ విషయం డిసైడ్ చేద్దామని చెప్పడం జరిగింది. ఈ మేరకు గురువారం రాత్రి సవ్యసాచి యూనిట్ తో నాగార్జున మీటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో సవ్యసాచి ప్రోగ్రెస్ , ఇంకా కావాల్సిన టైమ్ అన్నీ చూసి, మైత్రీ మూవీస్ జనాలకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సవ్యసాచి ఆగస్టు 15 తరువాత కానీ రాలేదని, ఇప్పటి దాకా అనేక సార్లు తేడా వచ్చినట్లే, మళ్లీ తేడా వస్తే, ఆగస్టులో చైతన్య సినిమా ఏదీ లేకుండా అయిపోతుందని, అందువల్ల శైలజ రెడ్డిని వదిలేయడం బెటర్ అని నాగ్ నచ్చచెప్పినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా, సవ్యసాచి కాన్సెప్ట్ బాగుందని, తొందరపడకుండా, ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు బాగా చూసుకుని, తయారుచేస్తే, చైతూకి మంచి సినిమా అవుతుందని నాగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద మైత్రీ మూవీస్ కు నచ్చ చెప్పి, శైలజరెడ్డి అల్లుడుకు లైన్ క్లియర్ చేసినట్లు బోగట్టా.
దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి వుంది.