మూడు రోజుల కిందట మెగా బ్రదర్ నాగబాబు..అనూహ్యంగా ఓ అంశంపై స్పందించారు. కత్తి మహేష్ అనే వ్యక్తి రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను చాలా ఘాటుగా వ్యక్తం చేశారు. కత్తి మహేష్ పేరు ఎత్తకుండానే…ఎన్ని మాటలనాలో అన్నీ అన్నారు. తనను గొప్ప రామభక్తుడిగా చెప్పుకున్నారు. రాముడ్ని ఇన్నిన్ని మాటలంటూంటే..బీజేపీ నేతలు ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. నాగబాబు స్పందన నిజంగానే చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అవసరంగా కత్తి మహేష్ విషయంలో జోక్యం చేసుకుని.. అతను మళ్లీ… మరింతగా రెచ్చిపోవడానికి అవకాశం ఇవ్వడం ఎందుకన్నదే చాలా మంది సందేహం.
నాగబాబు అంత వరకూ ఆలోచించినట్లు లేరు. పవన్ కల్యాణ్ విషయంలో గతంలో కత్తి మహేష్ చాలా వివాదాం సృష్టించాడు కాబట్టి… ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందనుకున్నారేమో కానీ… చాలా ఘాటుగా స్పందించారు. కానీ ఇప్పుడు దానికి కత్తి రియాక్షన్ నాగబాబు ఒక్కడికే పరిమితం కాలేదు మెగా కుటుంబం మొత్తానికి చుట్టేసి విమర్శలు గుప్పించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో… మెగా బ్రదర్స్ ముగ్గుర్నీ కలిపి విమర్శలు చేసారు. “ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా..‘జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్ సొసైటీ. మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది బాగా తెలుసు” అంటూ విమర్శలు గుప్పించారు. అనాల్సిందంతా అని మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ఇప్పుడు నాగబాబు… కత్తి మహేష్ వీడియోపై స్పందిస్తే.. మరింత రచ్చ కావడం ఖాయం. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకున్నా.. రాముడిపై నిందలేసినా.. కత్తి మహేష్ కు కావాల్సింది పబ్లిసిటీ. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ నాగబాబు మాత్రమే తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మాటకు మాట అనేశారు. ఇక నాగబాబు ఏం చేస్తారో..? సైలెంట్ గా ఉంటారో.. మరోసారి స్పందించి… సీరియల్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే..!