ఆల్మోస్ట్ ఏడాదిన్నర గ్యాప్ తరవాత వెంకటేష్ ఓ సినిమా కోసం ఈ రోజు ముఖానికి మేకప్ వేసుకున్నారు. హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ఎఫ్2’లో ఆయన ఓ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ మరో హీరో. ఈ రోజు వెంకీ సెట్స్‌లో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వదిలారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్, మరొకరు వున్న స్టిల్‌లో వెంకీ లుంగీ ఆడియన్స్‌ని అట్ట్రాక్ట్ చేసింది. ఎందుకంటే… మొన్న వరుణ్ తేజ్ కూడా సేమ్ టు సేమ్ లుంగీలో వున్న లుక్ బయటకు వదిలారు. ప్రజెంట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సీన్స్ తీస్తున్నార్ట. రీసెంట్ టైమ్స్‌లో మన సినిమా స్టార్స్‌లో లుంగీకి క్రేజ్ పెరిగింది. హిందీ హీరో షారుక్ ఖాన్ ‘లుంగీ డాన్స్’ అంటూ పాట చేశాడు. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడూ లెట్స్ కుమ్ముడూ’ పాటలో చిరంజీవి, ‘భరత్ అనే నేను’లోని ‘వచ్చాడయ్యో సామి…’ పాటలో మహేష్ బాబు లుంగీలో సందడి చేస్తే ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇక, ‘రంగస్థలం’లో సినిమా అంతా రామ్ చరణ్… ‘కృష్ణార్జున యుద్ధం’లో చిత్తూరు కుర్రాడి పాత్రలో నాని లుంగీలోనే సందడి చేశారు.