నాగచైతన్య – సమంత…. టాలీవుడ్లో`లవబుల్` జోడీ. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ సూసర్ హిట్టే. అందుకే.. నిజ జీవితంలోనూ జంటగా మారిపోయారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’తో ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘సవ్యసాచి’ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. పెళ్లైన తరవత సమంత, చైతూ జోడీగా కనిపించడం ఇదే తొలిసారి. కాబట్టి ఈసినిమాపై అంచనాలుఇప్పటికే మొదలైపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో చైతూ, సమంత ప్రేమికులుగా కనిపించడం లేదు. పెళ్లైన జంటగా దర్శన మివ్వబోతున్నారు. పెళ్లయిన కొత్తలో ఓ జంట ఎలా ఉంటుంది? వాళ్ల మధ్య జరిగే చిరు అలకలు, కోప తాపాలు ఎలా ఉంటాయి? అనేది ఇందులో చూపిస్తున్నారట. ఈ విషయంలో చైతూ కూడా క్లూ ఇచ్చేశాడు. ”నాకూ సమంతకీ పెళ్లయిపోయింది. ఇప్పుడు కూడా మేం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి కథలు ఎంచుకుంటే బాగోదు. శివ నిర్వాణతో చేయబోతున్న సినిమా లవ్ స్టోరీ కాదు. పెళ్లయిన ఓ జంట కథ ఇది. మమ్మల్ని ఊహించుకునే శివ ఈ కథ తయారు చేశాడట. అందుకే వినగానే ఒప్పుకున్నా..” అంటున్నాడు చైతూ. పెళ్లయిన కొత్తలో జరిగే కథ కాబట్టి.. అది ఇంచు మించుగా చై – శామ్ కథకు దగ్గరగా ఉండొచ్చు. ఇంకేముంది?? ఈ సారి కూడా కెమిస్ట్రీ అదిరిపోయే ఛాన్సులున్నాయి.