తేజ – బెల్లంకొండ కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. కాజల్ కథానాయికగా నటిస్తోంది. బెల్లంకొండతో పోలిస్తే.. కాజల్ యమా సీనియర్. వీరిద్దరికీ జోడీ ఎలా కుదురుతుందబ్బా? అనుకున్నారంతా. నిజానికి ఇదో లేడీ ఓరియెంటెడ్ కథ అట. అందుకే కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. కథంతా కాజల్ చుట్టూ తిరుగుతుందని, బెల్లంకొండ పాత్ర ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తుందని సమాచారం. తేజ సినిమాల్లో నటించడం నటీనటులకు ఓ సవాల్. తమలోని మరో కొత్త కోణం ఆయన సినిమాల ద్వారా బయటకొస్తుంది. డాన్సుల్లో, ఫైట్లలో రాణించిన బెల్లంకొండ నటుడిగానూ మార్కులు కొట్టేయడానికే ఈ ఆఫర్‌ని అందిపుచ్చుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి టైటిల్‌గా ‘సావిత్రి’, ‘సీత’లా.. ఓ పాత్ర పేరు పెట్టాలని భావిస్తున్నార్ట. అయితే.. ఈ రెండు టైటిళ్లతో ఆల్రెడీ సినిమాలొచ్చేశాయి. కాబట్టి పురాణాల్లో మరో స్త్రీ పాత్రని టైటిల్‌ని తీసుకోవాలని తేజ అనుకుంటున్నాడు. దాని కోసమే అన్వేషణ జరుగుతోంది.