‘వన్’ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతోందని ఆశించారు మహేష్ బాబు ఫ్యాన్స్. ‘రంగస్థలం’ చూసి ఫ్లాటైపోయిన మహేష్… తనకు ఆల్రెడీ ఓ ఫ్లాప్ ఇచ్చినా సరే, సుక్కుతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చాడు. సుకుమార్ కూడా మహేష్‌కి ఓ హిట్టిచ్చి బాకీ తీర్చేయాలనుకున్నాడు. వంశీ పైడి పల్లి సినిమా పూర్తవ్వగానే… సుకుమార్ సినిమా పట్టాలెక్కిద్దామనుకున్నాడు మహేష్. అయితే ఇప్పుడు ఈ సినిమా కాస్త డైలామాలో పడింది. సుకుమార్‌కి బాలీవుడ్ నుంచి ఆఫర్రావడమే ఇందుకు కారణం అనుకోవొచ్చు. వరుణ్ ధావన్ తో సుకుమార్ బాలీవుడ్లో ఓ సినిమా చేసే ఛాన్సుందని సమాచారం. బాలీవుడ్లో మెరిసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు? అందుకే సుకుమార్ అక్కడ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట.మహేష్ కి కూడా ఇప్పటికిప్పుడు సుకుమార్‌తో సినిమా చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. తన కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. సురేందర్ రెడ్డి కూడా మహేష్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. సైరా తరవాత.. సూరి – మహేష్‌ల కాంబో సెట్టయ్యే ఛాన్సుంది. మహేష్ కోసం ఆగాలంటే.. సుక్కు కొన్నాళ్లయినా ఖాళీగా ఉండాలి. అందుకే ఈలోగా మరో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాడట. అది హిందీలోనా, తెలుగులోనా? అనేదే తేలాలి