ప్రాణంగా ప్రేమించాడు అమ్మాయిని. ఆ అమ్మాయి ప్రేమించినట్లు నటించింది. చేసేది సేల్స్‌మ్యాన్‌గా చిరుద్యోగం అయినా.. సంపాదన అంతా అమ్మాయికి పెట్టేందుకు.. అతను వెనుకాడలేదు. ఆమెను సంతోషంగా ఉంచేందుకు తను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. కానీ మనోడి దగ్గర సరుకు అంతా అయిపోయి.. అప్పుల పాలయ్యే సరికి.. ఆ అమ్మాయి హ్యాండిచ్చేసింది. చివరికి దిక్కుతోచని స్థితిలో… ప్రాణం తీసుకున్నాడు.. ప్రేమికుడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.
గుంటూరు జిల్లా తెనాలికి వంశీకృష్ణ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ప్రేమించిన అమ్మాయే కారణమని లేఖ రాశాడు. తన జీవితాన్ని ప్రియురాలు నాశనం చేసిందని… లేఖలో విరక్తి వ్యక్తం చేశాడు. సూసైడ్‌నోట్‌లో.. వంశీకృష్ణ తన వ్యక్తిగత వివరాలతో పాటు యువతకు… సందేశం ఇచ్చాడు. ప్రేమ పేరుతో … సమయం వృథా చేసుకోవద్దని… అమ్మాయిల చేతిలో మోసపోవద్దని హెచ్చరికలు కూడా చేశాడు. ప్రేమ విషయంలో తొందర పడవద్దని ఒకటికి రెండు సార్లు తన లేఖలో వంశీకృష్ణ చెప్పడంతో.. అతను ప్రేమించిన అమ్మాయి… చాలా గట్టిగానే.. దెబ్బకొట్టిందని భావిస్తున్నారు. సూసైడ్ లెటర్ ఆధారాంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ లేఖలో ఉన్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తను పవన్ కల్యాణ్ ఫ్యాన్ట. తాను పవన్ కల్యాణ్ అభిమానినని.. ఆయన్ని ఒకసారి కూడా చూడలేదని.. వచ్చే ఎన్నికల్లో పవన్ గెలుపొందాలని సూసైడ్ లెటర్లో వంశీకృష్ణ కోరుకున్నాడు. పూర్తిగా బాధ్యతలు తెలియక ముందే.. సినిమాల ప్రభావంతోనే.. స్మార్ట్ ఫోన్ల మాయలో పడి… ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో… తప్పులు చేసి..జీవితాలను రిస్కుల్లో పడేసుకునే యువత ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నారు. జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో ప్రేమ పేరుతో సమయం వృథా చేసుకుని .. తీరిగ్గా జీవితం నాశనం అయిందంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితంలో ఎదురయ్యే పరిణామాలను ధైర్యం ఎదుర్కోలేకపోతున్నారు. ఈ కోవలోకే వంశీకృష్ణ వస్తారు.