రామ్చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టులో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ‘రంగస్థలం’ ఎంపికైంది. ఉత్తమ చిత్రాల కేటగిరిలోనూ ‘రంగస్థలం’కి ఎంట్రీ దక్కింది. ఆగస్టు 10 నుంచి 22 వరకూ మెల్బోర్న్లో ఈ చిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ‘రంగస్థలం’ చిత్రాన్ని అక్కడ స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఈసందర్భంగా రామ్చరణ్ ని ప్రత్యేక అతిథిగా చిత్రోత్సవాల సంస్థ ఆహ్వానించింది. ఈ యేడాది జరిగే మిగిలిన చిత్రోత్సవాలకూ ‘రంగస్థలం’ని పంపాలని చిత్రబృందం భావిస్తోంది. అక్కడ ఒకట్రెండు అవార్డులు గనుక తెచ్చుకుంటే.. `రంగస్థలం` పేరు అంతర్జాతీయంగానూ మర్మోగడం ఖాయం.