హైకోర్టు విభజన అంశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చేతుల్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు..సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం హైకోర్టు కోసం..భవనాలు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాట్లు చేసి… తెలియజేస్తే.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు కలిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ విషయంలో ఎటువంటి తుదిగడువు లేదని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పొందుపరిచిన విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది.
ఏపీ సర్కార్ చొరవ తీసుకుంటే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని సుప్రీంకోర్టు అఫిడవిట్ ద్వారా నేరుగా చెప్పినట్లయింది. హైకోర్టుకు సంబంధించి భవనాలు, మౌలిక సదుపాయాల బాధ్యత పూర్తిగా ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వందేనని పేర్కొన్న న్యాయశాఖ..వాటి కోసం.. నిధులు ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. అలాంటి పథకాలేవీ న్యాయశాఖ కాస్త వెటకారంగానే అఫిడవిట్ లో పేర్కొంది. హైకోర్టు విభజన చేయాలంటూ.. ఏడాదిన్నర క్రితం వరకూ టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఆందోళన చేశారు. అయితే తర్వాత పూర్తిగా చల్లబడిపోయారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం.. ఇప్పటికే అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణం కోసం… డిజైన్లను ఖరారు చేసుకుంది. కానీ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో రూ.108 కోట్ల వ్యయంతో తాత్కాలిక హైకోర్టు నిర్ణయం చేపట్టాలని జనవరి ఆఖరిలో ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పనులు కూడా.. కూడా మందుకు సాగలేదు. పెండింగ్ లో ఉండిపోయాయి. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో సమస్య వచ్చి పడింది. ఇప్పుడు… పదేళ్ల వరకూ హైకోర్టు ఉమ్మడిగా ఉండవచ్చని.. కేంద్రం నేరుగా అఫిడవిట్ దాఖలు చేయడంతో.. ఏపీ ఎప్పుడు కావాలంటే.. అప్పుడు హైకోర్టును తరలించుకునే అవకాశం ఉందని స్పష్టమయింది. అంటే ఇప్పుడు హైకోర్టు బాల్ ఏపీలోనే ఉంది.