ఈవారం విడుదలైన చిన్న సినిమా ఆర్.ఎక్స్ 100… మంచి వసూళ్లతో ఆకట్టుకుంటోంది. బోల్డ్ కంటెంట్ ఈ సినిమాకి ప్లస్. యూత్‌ని అదే థియేటర్లకు రప్పిస్తోంది. సినిమా, కథ, కథనాలు ఎలా ఉన్నా… హీరోయిన్ మాత్రం సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలచింది. తనే… పాయల్ రాజ్ పుట్. ముద్దు సీన్లలో ఈ అమ్మాయి వీరంగం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సినిమాల్లో ఇంతటి ఘాటు ముద్దులిచ్చిన హీరోయిన్ని చూడలేదని అంటున్నారు. అదీ నిజమే. తెలుగు సినిమాలు – ముద్దులు.. అనే టాపిక్ రాస్తే.. ఈ అమ్మాయి పేరు తప్పకుండా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ స్థాయిలో రెచ్చిపోయింది. తెలుగులో బోల్డ్ పాత్రలు రాసుకుంటున్నప్పుడు ` ఈ తరహా పాత్రలు చేస్తారా?` అనే అనుమానాలుండేవి. పాయల్ రాకతో.. అవన్నీ పటాపంచలైపోయాయి. ఆర్.ఎక్స్ 100 లో పాయల్ చేసిన విన్యాసాలు చూసి.. ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఈ సినిమా తరవాత హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతికి ఏమాత్రం అవకాశాలు వస్తాయో తెలీదు గానీ, పాయల్‌కి మాత్రం రెండు మూడు ఛాన్సులు దక్కడం ఖాయం.