తలకు మించిన తలపాగా అని వెనకటికి సామెత. సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. హీరో మార్కెట్ చూసుకోవాలి. డైరక్టర్ ట్రాక్ రికార్డు చూడాలి. అంతే కానీ కథ డిమాండ్ చేసిందని హెవీ బడ్జెట్ పెడితే ఇబ్బందే. ఇది ఇంతకు ముందు చాలా మందికి అనుభవం అయింది. అంతెందుకు డైరక్టర హను రాఘవపూడి తీసిన లై సినిమా నిర్మాతకూ అనుభవం అయింది.
అయితే ఇప్పుడు మళ్లీ అదే హనురాఘవపూడి చేస్తున్న సినిమాకు కూడా నలభై కోట్ల వరకు ఖర్చయిపోతోందని తెలుస్తోంది.ప్రస్తుతం హను రాఘవపూడి పడి పడి లేచె మనసు అనే సినిమాను శర్వానంద్-సాయిపల్లవిలతో చేస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా 120 వరకు వర్కింగ్ డేస్. భారీ సెట్. కలకత్తా షెడ్యూలు. సిజి వర్క్.
పైగా శర్వానంద్, సాయిపల్లవి, హను రాఘవపూడి రెమ్యూనిరేషన్లు కలిసి పది కోట్ల వరకు వుంటాయి. ఆపైన మిగిలిన ప్రొడక్షన్ ఖర్చు. అంతా కలిపి 40 వరకు వుంటుందని టాక్ వినిపిస్తోంది. పైగా శర్వానంద్ కూడా తన మార్కెట్ బాగుందని, పెద్దగా సమస్యరాదని, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావద్దని, దర్శక నిర్మాతలకు చెబుతున్నట్లు బోగట్టా.
శాటిలైట్, డిజిటల్ రైట్స్ శర్వా-సాయిపల్లవి జోడికి బాగానే వుంటాయి. అయినా కూడా కనీసం పాతిక కోట్ల మేరకు థియేటర్ రైట్స్ అమ్మాల్సి వుంటుంది. అది సాధ్యమే అనుకున్నా, ఇంత పెట్టినందున, ఆ రేంజ్ మార్జిన్స్ వుండాలి కదా? నలభై ఖర్చు చేసాం, నలభై కు అమ్మాం అనిపించుకుంటే ఎలా? లాభం వుండాలి కదా?