ఎన్టీఆర్ గురించి చెబుతున్నప్పుడు ఆయన అభిమానుల ప్రస్తావన తీయకుండా ఎలా ఉంటాం? అభిమానమే ఆయన బలం.. ధనం. ఈ విషయాన్ని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లోచెప్పారు. మరి ఎన్టీఆర్ బయోపిక్‌లో వాళ్లకు స్థానమెంత? ఈ విషయంలో కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఎన్టీఆర్ వీరాభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్లలో కొంతమందిని పోలిన పాత్రలు ఈ సినిమాలో చూపిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి – అభిమానులకూ మధ్య ఉన్న అనుబంధం చూస్తే, ఆయన అభిమానులకు ఇచ్చిన ఆశ్చర్యమేస్తుంది. కుంటి సాయి అనే అభిమానికి ఎన్టీఆర్ ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఆ అభిమానిపై ఎన్టీఆర్‌కి ఎందుకంత ప్రేమ? తన కోసం ఎన్టీఆర్ ఏం చేశారు? అనేది ఆసక్తికరం. ఇదంతా ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపిస్తారని సమాచారం. కుంటి సాయి పాత్రని కూడా ఓ ఎన్టీఆర్ వీరాభిమానితో వేయించాలని చిత్రబృందం భావిస్తోంది. ఎన్టీఆర్‌కీ అభిమానుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సన్నివేశాలు ఈ చిత్రంలో కొన్ని ఉన్నాయని, అవన్నీ అలనాటి ఎన్టీఆర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.