నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను.. సెట్ చేస్తా ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్ కాని ఇదే నాగ్ విషయానికొస్తే నేను ట్రెండ్ సెట్ చేయను క్రియేట్ చేస్తా అంటాడేమో.. ఎందుకంటే 50 ఏళ్ల వయసులో కూడా సోగ్గాడిగా చలాకీ కుర్రాడు అనిపించుకుంటున్నాడంటే అది కేవలం కింగ్ నాగార్జునకే సాధ్యమైంది. ఇంతకీ నాగ్ క్రియేట్ చేసే ట్రెండ్ ఏంటి అంటే తానో టాప్ హీరో అయినా సరే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడమే. కనీసం ఒక్క సినిమా అనుభవం కూడా లేని కొత్త దర్శకులతో తాను సినిమా తీసి హిట్ కొట్టడమే నాగ్ క్రియేట్ చేసే ట్రెండ్. ఇంతకీ నాగ్ ఇలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాలు ఎన్ని అంటే చాలానే ఉన్నాయి.
అంతెందుకు ఇప్పుడు మన ఎవరైతే సంచలన దర్శకుడు విమర్శల రారాజు అంటామో అలాంటి రాం గోపాల్ వర్మకు ‘శివ’లాంటి అవకాశం ఇచ్చింది నాగార్జునే. ఇక ఆయన పరిచయం చేసిన దర్శకులు చాలా మందే ఉన్నారు లేండి. ఇకపోతే రీసెంట్ గా సోగ్గాడే చిన్ని నాయనాతో కళ్యాణ్ కృష్ణ అనే న్యూ టాలెంటెడ్ డైరక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశాడు నాగ్. సినిమా హిట్ కాబట్టి నాగ్ పరిచయం చేసినందుకు మంచి ఫలితమే వచ్చింది అనుకోవచ్చు. కాని అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే కొత్తవారిని నమ్మి నాగ్ సినిమా ఇస్తున్నాడు అంటే ఆ దర్శకుడిలో కచ్చితంగా టాలెంట్ ఉన్నట్టే లెక్క.
అయితే నాగ్ ఇదవరకు పరిచయం చేసిన దర్శకుల్లో ఒకరిద్దరు తప్ప తనకు మంచి హిట్ ఇచ్చిన వారే. మరి అసలు సిసలైన ట్రెండ్ క్రియేట్ చేయడం అంటే టాలెంటెడ్ దర్శకులను పరిశ్రమకు పరిచయం చేయడమే అందుకే ట్రెండ్ సెట్టర్ గా నాగ్ గెలుపు సూత్రాన్ని పాటిస్తున్నాడు అని చెప్పొచ్చు. మీరేమంటారు రీడర్స్..!