సచిన్ టెండూల్కర్ ఎలా ఫేమస్సయ్యారు..? … క్రికెట్లో టన్నుల కొద్దీ సెంచరీలు చేసి..!. సన్నిలియోన్ ఎలా పేరు తెచ్చుకున్నారు..? పోర్న్ మూవీస్‌లో స్టార్‌గా ఎదిగి..!. మరి వైఎస్ జగన్ ఎలా పాపులర్ అయ్యారు..?. అనతి కాలంలోనే ఆయన సంపాదించిన అంతులేని సంపద వల్ల..! దాని కోసం చేసిన అవినీతి వల్ల..!. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవు. నాకు క్రికెట్ చేత కాదు.. అని సచిన్ అంటే.. అందరూ కామెడీలు చేస్తున్నారని నవ్వుతారు. నేను పోర్న్ మూవీస్‌కి వ్యతిరేకమని.. సన్నిలియోన్ చెబితే… అదే రియాక్షన్ వస్తుంది. మరి జగన్ కూడా.. “నేను అవినీతిని అంతం చేస్తా.. అదంటే నాకు అసహ్యం” అని సీరియస్‌గా చెబితే…అలాంటి ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది.
సందర్భం ఏమిటో కానీ… ఓ తెలుగు మీడియా చానల్‌కు వైఎస్ జగన్ ఓ పెద్ద ఇంటర్యూ ఇచ్చారు. అందులో చాలా అంశాలు మాట్లాడారు కానీ.. అవినీతిపై ఆయన ఇచ్చిన క్లారిటీనే హైలెట్. తాను రాగానే.. అవినీతిని రూపు మాపేస్తారట. దేశం అంతా ఆశ్చర్యపోయేలా చేస్తారట. ఇంటర్యూ చేసిన జర్నలిస్ట్ కూడా కూడా ఈ మాటలు విని.. ఫీలింగ్స్ దాచుకోవడానికి కష్టపడ్డారు. అందుకే కాసేపటి వరకు కెమెరాను జగన్‌పైనే కాన్సన్ట్రేట్ చేశారు. మరి లక్షకోట్ల ఆరోపణల సంగతేమిటని ప్రశ్నిస్తే.. అందులో పది పైసలు ఇచ్చేస్తే… ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తానన్నారు. పది పైసలు అంటే.. జగన్ లాంగ్వేజ్‌లో టెన్ పర్సంట్. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు… జగన్ క్విడ్ ప్రో కో లావాదేవీల్లో ఈ “టెన్ పర్సంట్ ” చాలా కీలకమన్న ప్రచారం జరిగింది. మిస్టర్ టెన్ పర్సంట్ అన్న నిక్‌నేమ్ కూడా రాజకీయవర్గాల్లో ఉంది. యాధృచ్చికంగా జగన్ నోట అదే వచ్చింది. జగన్ ఆస్తులన్నీ.. పేపర్ల మీద.. కంపెనీల పేరుతో ఉంటాయి. లోటస్ పాండ్ ఇల్లు కానీ… యలహంక ప్యాలెస్ కానీ.. బెంగుళూరులోని మంత్రి కాంప్లెక్స్ కానీ… సూట్ కేస్ కంపెనీల పేర్ల మీదే ఉంటాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా. ఒక్కటీ జగన్ పేరు మీద ఉండదు. అందుకే… తెలుగుదేశం పార్టీ నాయకులు… దమ్ముంటే ఆస్తులు ప్రకటించమని.. సవాల్ చేస్తూంటారు. కానీ జగన్.. లైట్ తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో లోటస్ పాండ్ ఇంటి విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే.. ఆ ఇల్లు..నాలుగైదు సూట్ కేస్ కంపెనీల పేరు మీద ఉందని.. గతంలో మీడియానే వెల్లడించింది.
తనపై వచ్చినవి ఆరోపణలేనని చెప్పుకోవడానికి జగన్ ఉత్సాహపడ్డారు.. మరి సీబీఐ కేసులు… వైఎస్ సీఎం కాగానే అంబానీలను తలదన్నేలా పెరిగిపోయిన తన ఆస్తుల గురించి మాట్లాడలేదు. అప్పటికే జగన్ అవినీతిని అంతం చేస్తానన్న మాటతో మైండ్ బ్లాంక్ అయిపోయిందేమో కానీ రిపోర్టర్ కూడా… వీటి గురించి ప్రస్తావించలేదు. కానీ తానెప్పుడూ సచివాలయానికి రాలేదని.. ఏ ఐఏఎస్, ఐపీఎస్ అధికారితో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే లేనన్నారు. అవినీతి చేయలేదనడానికి ఇవన్నీ సాక్ష్యాలన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు.
జగన్ చెప్పిన ఈ అవినీతి సూక్తుల్ని… సదరు ఇంటర్యూ చేసిన చానల్ ప్రత్యేక క్లిప్‌గా ఇంటర్నెట్లో పెట్టేసింది. అదేదో సూపర్ హిట్ కామెడీ సీన్ అన్నట్లుగా నెటిజన్లు చూసేస్తున్నారు. ఈ విషయం సాక్షి మీడియాలోని మనుషులకు వెంటనే అర్థం అయింది. జగన్ ప్రత్యేక ఇంటర్యూ అంటూ..తన వెబ్సైట్లో వివరంగా రాసుకున్నా…. ఆ ఒక్క అవినీతి టాపిక్‌ని మాత్రం మాత్రం కట్ చేసేశారు. తాము కూడా కామెడీ కాకుండా జాగ్రత్తపడ్డారు.