మంచు లక్ష్మి తెలుగువాళ్లపై అలిగినట్టుంది. `నేను తమిళంలోకి వెళ్లిపోతా..` అంటోంది. ప్రస్తుతానికి అక్కడో సినిమా చేస్తోంది లక్ష్మి. తమిళం సెట్లో తనని చాలా గౌరవిస్తున్నారని, ముద్దు ముద్దుగా చూసుకుంటున్నారని, తెలుగులో తనకు సరిపడా పాత్రలు రావడం లేదని చెప్పుకొచ్చింది. మలయాళం, కన్నడ సినిమా ఆఫర్లు వచ్చినా ఏమాత్రం ఆలోచించనని, ఒకే చోట స్థిరపడిపోవడం తనకు నచ్చదని సెలవిచ్చింది. మంచు లక్ష్మి మాటల్ని చూస్తే… తెలుగులో తన టాలెంట్‌కి తగిన పాత్రలు రావడం లేదనే అనిపిస్తోంది. గుండెల్లో గోదారి, దొంగాట, చందమామ కథలు ఇలాంటి సినిమాల్లో మంచు లక్ష్మి తన ప్రతిభను చూపించడానికి ప్రయత్నించింది. అయితే అందులో లక్ష్మి నటనకు గానూ కేవలం పాస్ మార్కులే పడ్డాయి. పైగా… సోలో హీరోయిన్గా అవకాశాలు వస్తున్నా, అవి అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి. `లక్ష్మీబాంబ్` తుస్సుమంది. ఇప్పుడు `వైఫ్ ఆఫ్ రామ్` పైనే ఆశలు పెట్టుకుంది. ఇన్ని అవకాశాలు వచ్చినా.. లక్ష్మికి తెలుగుపై కోపం ఎందుకో? తమిళంలోనూ ఈమధ్య అద్భుతాలేం రావడం లేదు. అక్కడా ఇలానే ఉంది పరిస్థితి. ఇంట గెలచి రచ్చ గలవాలిగానీ, ఇంటిపై అలిగి కాదు. మరి లక్ష్మి ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో, ఏంటో??