దువ్వాడ జగన్నాథమ్ తరవాత హరీష్ శంకర్‌తో దాగుడు మూతలు సినిమాని ప్రకటించారు దిల్‌రాజు. ఆ సినిమాలో హీరోల ఎంపిక కూడా పూర్తయిపోయిందని, సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి అని చెప్పుకున్నారు. అయితే అలా చెప్పి యేడాది అయిపోయింది, అయినా ఈ సినిమా విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈమధ్యలో హీరోలూ మారారు. ఇప్పుడు స్క్రిప్టే మారిపోబోతోంది. దాగుడు మూతలు స్క్రిప్టు పూర్తిగా పక్కన పెట్టేశారని తెలిసింది. దీనిపై దిల్ రాజు కూడా స్పందించాడు ”ఆ కథ మేం అనుకున్నట్టుగా రాలేదు. అందుకే దాని గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఆ స్క్రిప్టునే అటూ ఇటూగా మార్పులు చేసి సినిమా తీస్తామా, లేదంటే కొత్త కథతో వస్తామా? అనేది ఇంకా తేలలేదు. కాకపోతే మా సంస్థలో హరీష్‌తో ఓ సినిమా మాత్రం ఉంటుంది. అదెప్పుడో ఇప్పుడే చెప్పలేను” అంటున్నాడు. అంటే.. దాగుడు మూతలు మూతబడినట్టే.