వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరిపోయింది. ఢిల్లీ రాజకీయాల్లో తాము జీరోలయ్యామనే అసహనమో… చంద్రబాబు… స్కోర్ చేస్తున్నారనే.. అక్కసో కానీ… వ్యక్తిగత విమర్శల చేయడానికి అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమ పార్టీ పాత్రేమీ లేకపోయినా… మీడియా ముందుకు వచ్చి మద్దతిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత తాము మద్దతిచ్చినా.. ఇవ్వకపోయినా… రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని గుర్తొచ్చిందో.. .. పక్కన ఉన్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారనో కానీ.. ఒక్క సారిగా సహనం కోల్పోయారు. చంద్రబాబు ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అంటూ రెచ్చిపోయి విమర్శలు చేశారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడం ఇదే తొలి సారి కాదు. గత పార్లమెంట్ సమావేవేశాల్లోనూ ఇదే తరహా విమర్శలు చేశారు. తల్లిదండ్రులను కలిపి విమర్శలు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఫోర్త్ జెండర్ పేరుతో.. కొత్త తరహా తిట్లు వినిపిస్తున్నారు. ఉన్నత విద్యాంవతుడైన విజయసాయిరెడ్డి… నోటి నుంచి ఇలాంటి తిట్లు వస్తాయని… ఎవరూ ఊహించడం లేదు. కానీ ఆయన మత్రం.. తన చదువు, బ్యాక్ గ్రౌండ్ లాంటి విషయాలనేమీ పట్టించుకోకుండా.. రాజకీయాలనే బురదలో పడ్డాను కాబట్టి.. అలాంటి మాటలు అనాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా… వ్యక్తిగతంగా ఒకరికొకరు విమర్శించుకోవడానికి ఎవరూ సిద్ధపడరు.కానీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం వయసు, స్థాయిని కూడా పట్టిచుకోకుండా ముఖ్యమంత్రిని .. అసభ్యంగా తిడుతున్నారు.
వైసీపీ నేతల్లో ఇలాంటి అసహనం… ఒక్క విజయసాయిరెడ్డిలోనే కాదు.. చాలా మందిలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే రోజా విమర్శలు ప్రారంభిస్తే.. పత్రికల్లో రాయగలిగేలా.. చాలా కొద్ది విమర్శలే మిగులుతాయి. అంతగా సెన్సార్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తనది రోజా కంటే పెద్ద నోరు అని విజయసాయిరెడ్డి నిరూపించుకోవాలనుకుంటున్నారేమో కానీ ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటున్నారు. వైసీపీలో ఇప్పుడు విజయాసాయిరెడ్డి నెంబర్ -2. ఆయన ఏం మాట్లాడినా.. పార్టీ ఇమేజ్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ వైసీపీ నేతలంతా.. తమ మార్క్ బ్రాండ్ వైసీపీకి ఉండాలనేమో రెచ్చిపోతున్నారు. విజయసాయిరెడ్డి ఒక మాట అంటే.. టీడీపీ నేతలు పది మాటలంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రోజాకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ ఇలాంటిదే. కానీ ఇలాంటి వ్యక్తిగత అసభ్యమైన తిట్ల వల్ల తగ్గిపోయేది రాజకీయ విలువలే. ఈ నిజాన్ని గుర్తించలేకపోతున్నారు.