వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏదీ కలసి రావడం లేదు. తాను స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే నిర్ణయాలే కాకుండా.. తనకు సంబంధం లేకపోయినా… ఇతరులు తీసుకునే నిర్ణయాలు కూడా తననే కార్నర్ చేస్తున్నాయి. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజే.. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. స్పీకర్ అంగీకరించారు. ఎంపీల మద్దతూ లభించింది. కానీ స్పీకర్‌కు చర్చ చేపట్టడానికి పది రోజుల సమయం ఉంది. కానీ ఎక్కువ సమయం తీసుకోలేదు..శుక్రవారమే చర్చ అని ఖరారు చేశారు. డేట్ ఖరారు కాగానే… మిగతా పార్టీలన్నీ సన్నాహాల్లో ముగిసిపోతే.. తల పట్టుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది.
ఓ వైపు దేశం మొత్తం… కన్నార్పకుండా.. పార్లమెంట్ వైపు చూస్తూ ఉంటుంది. వైసీపీ తరపున రాజీనామా చేసిన ఎంపీలు.. లోపలికి వెళ్లే అవకాశం పార్లమెంట్ గేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద .. తమ బాధను మొరపెట్టుకుంటూ ఉంటారు. అంత వరకూ ఎప్పుడూ జరిగేదే.. కానీ ఇంత కీలక సమయంలో ప్రతిపక్ష నేత జగన్ చేస్తూంటారనే ప్రశ్న ఎవరికైనా వస్తే మటుకే అసలు సమస్య వస్తుంది. శుక్రవారం వైఎస్ జగన్ పది గంటల కల్లా సీబీఐ కోర్టులో హాజరు వేయించుకోవాలి. సాయంత్రం వరకూ విచారణలో భాగంగా కోర్టులో ఉండాలి. కోర్టు సమయం అయిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది..వైసీపీకి. ఈ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉపయోగించుకోకుండా ఉంటాయా..? పార్లమెంట్ సభ్యులు… ఏపీ కోసం… పార్లమెంట్లో పోరాడుతూంటే..అదే ఏపీని దోచుకున్న జగన్… కోర్టు బోనులో నిలబడ్డారంటూ.. ప్రచారం చేయకుండాఎలాఉంటుంది…? దీనికి సంబంధించి గురువారం నుంచే టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్నే కుట్ర అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… శుక్రవారమే చర్చ చేపట్టడాన్ని కుట్ర అని ఎందుకు అనకుండా ఉంటుందన్న సందేహం చాలా మందిలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉండే సమయం చూసి.. అవిశ్వాసాన్ని డ్రామాలా నడిపించేస్తున్నారని చెప్పినా చెప్పుకోవచ్చు. ఎంత అడ్డంగా సమర్థించుకున్నా.. వైఎస్ జగన్ మాత్రం… ఎంపీల రాజీనామాలు, శుక్రవారం రోజే అవిశ్వాసంపై చర్చ జరగడం వంటి విషయాల్లో సూప్‌లో పడిపోయారని చెప్పాలి. కుట్ర అని అని ఎంత అరచి గీ పెట్టుకున్నా… జరిగే డ్యామేజ్ జరగకుండా ఉంటుందా..?