తెలుగు చలన చిత్ర పరిశ్రమకి 2016 శుభారంభాన్ని ఇచ్చిందని చెప్పాలి. మెయిన్ గా జనవరి 1న వచ్చిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ అయి 20 కోట్లు వరకు రాబట్టి బాక్సాఫీస్ కి మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2015 డిసెంబర్ నుంచి చెప్పిన నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తాయా రావా అనే ప్రశ్న అందరిలో నిలిచింది. అనుకున్న దాని ప్రకారమే ఆ నాలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. అవే డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా. నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా,
ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి సీజన్ లో సూపర్ కలెక్షన్స్ ని రాబట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని సినిమా లు ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా సంక్రాంతి మొదటి వారంలో ఈ సినిమాలు 90 కోట్ల షేర్ ని బాక్సాఫీస్ కి అందించాయి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు కలిపి సుమారు 150 కోట్ల బిజినెస్ చేస్తాయని అంచనా వేశారు. ఆ అంచనాల దిశగానే ఇది దుసుకోపోతూ 90 కోట్లు రాబట్టింది. మొదటి వారం ఏ సినిమా ఎంతెంత రాబట్టింది అనే విషయానికి వస్తే…..
సినిమా ఫస్ట్ వీక్ షేర్
నాన్నకు ప్రేమతో 45. 40 కోట్లు
సోగ్గాడే చిన్ని నాయనా 23.35 కోట్లు
డిక్టేటర్ 17.40 కోట్లు
ఎక్స్ ప్రెస్ రాజా 06.95 కోట్లు
4 సినిమాల మొత్తం షేర్ 93.10 కోట్లు