గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాల్ని తీసిన నిర్మాత శరత్ మరార్. ఇప్పుడో చిన్న సినిమాని విడుదల చేస్తున్నారు. అదే… `ప్రేమకు రెయిన్ చెక్`. ఈ టైటిల్ ఏదో విచిత్రంగా ఉంది కదా? రెయిన్ చెక్ అంటే ఇచ్చిన ఆఫర్‌ని భవిష్యత్తులో తీసుకుంటాను అని అర్థం. మరి ప్రేమించే ఆఫర్ ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తమనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆకెళ్ల శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాచూసి, నచ్చి.. శరత్ మరార్ సమర్పకుడిగా మారారట. మరి ఈ చిన్న సినిమాలో ఆయన్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటో?? పవన్‌తో గ్యాప్ వచ్చాక సినిమాలపైన దృష్టి బాగా తగ్గించేశారు శరత్ మరార్. ఈ సినిమాతో మళ్లీ నిర్మాణ రంగంలో చురుగ్గా మారాలని డిసైడ్ అయ్యార్ట. ఆయన దృష్టి పెడితే.. యేడాదికి రెండు మూడు పెద్ద సినిమాలు తీసేయొచ్చు. మరి ఈ చిన్న సినిమాని ఎందుకు పట్టారో..!