ఆస్తి కోసం సొంత నాన్నమ్మేనే హత్య చేసి దోపిడి దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో.. మనవడు. కీసర మండలం పోచమ్మకాలనీలో నాలుగు రోజుల కిందట.. 80 సంవత్సరాల వయస్సున్న పురణ్ పెద్దమ్మ అనే వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. పనిపై బయటకి వెళ్లిన కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి వచ్చే సరిగా విగత జీవిగా పడివుండడం… శరీరంపై బంగారు అభరణాలు లేకపోవడంతో కీసర పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. శరీరంపై నగలు మాయం కావడం తో దొంగల పనిగా అనుమానించిన పోలీసులు సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు.
పురణ్ పెదమ్మ మనువడు పురణ్ శ్రీకాంత్ నుండి వివరాలు సేకరిస్తున్న క్రమంలో పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించడంతో విషయం మొత్తం కక్కేశాడు. వృద్దురాలిని హత్య చేసింది. మనవడే పురణ్ శ్రీకాంతేనని తేలింది. పదవతరగతి వరకు చదివిన శ్రీకాంత్‌కు చదువు అబ్బలేదు. జల్సాలకు అలవాటు పడి నేరాల వైపు వెళ్లాడు. తను పని చేస్తున్న కంపెనీలో డబ్బు కోసం ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని.. పెళ్లి చేయాలని తండ్రి భావించాడు.
అయితే ఇల్లు చిన్నది కావడం…ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో నాయనమ్మ వుండడం… పెళ్లైన తర్వాత బయటకి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో పాటు… నానమ్మను హత్య చేస్తే రూమ్ సొంతమవుతుందని..భావించాడు. తన అవసరాల కోసం డబ్బు కావాల్సి రావడంతోఆమె పై వున్న నగలను దోచుకోవచ్చని ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 21 వ తేదిన ఇంట్లో అందరు పనిపై బయటికి వెళ్లడంతో గదిలోఒంటిరిగా వున్న నాయనమ్మను మధ్యాహ్నం 2.30 నిమిషాలకు దిండుతో ఊపరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అంతరం ఆమె పై వున్న బంగారు అభరణాలను తీసుకెళ్లాడు. కానీ పోలీసులకు చాలా సులువుగా దొరికిపోయాడు.