ఒకప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాత ఎమ్ ఎస్ రాజు. ఆయన తీసిందల్లా హిట్ నే. కానీ పౌర్ణమి సినిమాతో ఆయన సినిమాల నిర్మాణం అమావాస్య అయిపోయింది. ఆ తరువాత కొడుకు ను హీరోను చేయాలని తాపత్రయం ఒక పక్క, తను డైరక్షన్ చేసేయాలన్న తపన మరోపక్క కలిసి, ఆయనను మరింత వెనక్కు నెట్టాయి. అయినా ఆయనేం మారలేదు.
కొడుకు సుమంత్ అశ్విన్ తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాను ఇప్పడు విడుదలకు రెడీ చేసారు. ఈ సినిమాను జస్ట్ రెండు నుంచి రెండున్నర కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేసేసారు. ప్రభాస్ తో వున్న మొహమాటం, చుట్టరికం వాడేసి, యువి బ్యానర్ ను జోడించారు. పేరుకు యువి బ్యానర్ ను జోడించినా, కథ అంతా తెరవెనుక ఆయనే నడిపించారు. నడిపిస్తున్నారు. యువి వాళ్లు ప్రభాస్ కోసం సినిమాను స్మూత్ గా థియేటర్లలోకి పంపుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమింటంటే, యువి బ్యానర్ జోడించడంతో ఈ చిన్న సినిమా శాటిలైట్ అయిపోయింది. జీ టీవీ కొన్నట్లు తెలుస్తోంది. అమౌంట్ ఎంతన్నది తెలియకపోయినా, నిర్మాణం ఖర్చు చాలా వరకు రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. ఇక పబ్లిసిటీ ఖర్చు రికవరీ కావాలి. అది యువి వాళ్లు పెట్టుబడి పెడుతున్నారు. ఓపెనింగ్స్, ఫస్ట్ వీకెండ్ ఏమయినా వస్తే దానికి వెళ్లిపోతుంది.
మొత్తం మీద రాజుగారు కొడుకుకు ఓ సినిమా చేయించేసారు. పెద్దగా లాభమూ లేదు. అంతకు మించి నష్టమూ లేదు. హ్యాపీనే కదా?