జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై… జగన్మోహన్ రెడ్డి వివాదాస్పదగంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. దాంతో.. జనసేన ఫ్యాన్స్… జగన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు .. వెల్లువెత్తేలా చేశారు. అందులో ఓ ఫోటో అందర్నీ ఆకర్షించింది. ఓ అందమైన మోడల్‌తో జగన్ తీసుకున్న సెల్ఫీ అది. ఆమె అంత ఫేమస్ కాకపోవడంతో… అందరూ రకరకాల కథనాలు అల్లడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో అవే హాట్ టాపిక్ కావడంతో.. ఆ మోడల్ గుడ్ల నీరు కక్కుకుంటూ బయటకు వచ్చారు. తన పరువు తీయవద్దని అదే సోషల్ మీడియా వేదికగా… నెటిజన్లను వేడుకున్నారు.
జగన్‌తో పాటు సెల్పీ దిగిన మోడల్ అలేఖ్య ఏంజల్. 2017 ఫిబ్రవరి 18న లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ చేతుల మీదుగా ఓ సీడీని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య పాల్గొన్నారు. అప్పుడే జగన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సెల్ఫీలను గతేడాది ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలను వైరల్ చేసిన పవన్ అభిమానులు కొందరు వారిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ సృష్టించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఫొటో వైరల్ అవుతుండటం.. ట్రోల్స్ వస్తుండటంతో అలేఖ్య స్పందించి వివరణ ఇచ్చారు. ” వైఎస్ జగన్ గారితో సెల్ఫీ దిగినందుకు కొందరు నాపై ఇబ్బందికరమైన రూమర్స్ చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవి. అందుకే నేను ఈ విషయంపై స్పందించాలనుకున్నాను. ఈ రూమర్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను.” అని సోషల్ మీడియాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టారు.
సోషల్ మీడియాలో ఎవరు ఏమిటో తెలుసుకోకుడా… రాజకీయ పరంగా చేసే విమర్శలు.. ఒకరిని కించ పరచడానికి మరొకరి ఫోటోలు సర్క్యులేట్ చేయడం కామన్‌గా మారిపోయింది. ఇలాంటి వ్యవహారాల్లో… ఏమీ సంబంధం లేని వాళ్లే బాధితులవుతున్నారు. అలాగే అలేఖ్య కూడా అయ్యారు. క్లారిటీ వచ్చిన తర్వాతైనా..జనసేన ఫ్యాన్స్.. శాంతిస్తారో లేదో మరి..!