1971 నాటి భారత్ పాకిస్థాన్ యుద్ధ కథాంశంతో వస్తున్న సినిమా ‘ఘాజి’. సిని చరిత్రలోనే నావికా దళం యుద్ధం నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా ఇది ప్రాచుర్యం పొందటం విశేషం. బాహుబలి సినిమాతో భారతదేశం మొత్తం క్రేజ్ సంపాధించిన రానా ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెబుతున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ‘ఘాజి’ సినిమాను సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవనుంది. జనవరి 7 నుండి మొదలైన ఈ సినిమా చిత్రీకరణ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్ అద్భుతంగా వచ్చిందంటూ సినిమా గురించి ఎంతో ప్రత్యేకంగా చెబుతున్నాడు రానా. ఘాజి సినిమాలో రావు రమేష్ కూడా కీలక పాత్ర పోశిస్తున్నట్టు తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొద్దిపాటి విరామం తర్వాత మరో షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే బెంగుళూరు డేస్ తో పాటుగా ఈ సినిమాను చేస్తున్న రానా.. ఈ సినిమాలను పూర్తి చేసి కాని బాహుబలి కంక్లూజన్ షూట్ లో పాల్గొనే అవకాశం ఉంది.