గతేడాది ప్రియమణి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి ముందూ.. పెళ్ళికి తర్వాత.. నటిగా ఆమెలో పెద్ద మార్పు కనిపించలేదు. పెళ్ళి చేసుకునే సమయానికి కన్నడ సినిమాలు నాలుగైదు ఆమె చేతిలో వున్నాయి. అక్కడ బిజీ హీరోయిన్. దాంతో పెళ్ళైన మూడో రోజు నుంచి యథావిధిగా సినిమా షూటింగులకు అటెండ్ అయ్యారు. తర్వాత తెలుగులో ‘ఢీ 10’ డాన్స్ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. పెళ్ళి తర్వాత బిజీ బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు ఓ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నార్ట. ఎందుకంటే… ఆమె తల్లి కాబోతున్నారని సమాచారం. అందుకు బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన పోస్ట్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. “త్వరలో మా నుంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జయిటింగ్ న్యూస్ రాబోతుంది. వెయిట్ అండ్ వాచ్” అని భర్త ముస్తఫా రాజ్ తో కలసి దిగిన ఫోటోని పోస్ట్ చేశారు. పెళ్ళి తర్వాత ఎగ్జయిటింగ్ న్యూస్ అంటే తల్లి కావడమేనని ప్రేక్షకులు ఓ అంచనాకి వస్తున్నారు.