గత వారంలో… తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు జరుపుకున్నారు. జ్వరంతో ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. పెద్దగా ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. కానీ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. మిగతా వాటి సంగతేమో కానీ.. టాలీవుడ్ మొత్తం .. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర్నుంచి… నాగార్జున కుమారుడు అఖిల్ వరకు చాలా మంది ఉన్నారు. సినిమా తారలు..ఓ రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు గతంలో లేవు. అంత ఎందుకు.. కేసీఆర్, చంద్రబాబు పుట్టినరోజులప్పుడు కూడా.. సినీతారల ట్విట్టర్లలో శుభాకాంక్షలు కనిపించవు. కానీ కేటీఆర్ మాత్రం ఈ అభిమానానికి పాత్రడయ్యారు.
ఊరికనే రారు మహానుభావులనే సామెత ఉంది. ఇది కచ్చితంగా టాలీవుడ్‌కు వర్తిస్తుంది. టాలీవుడ్ ఎవరు ఏం చేసినా.. ఊరకనే చేయరు. దానికో లాజిక్ ఉంటుంది. కేటీఆర్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షల వెనుక ఇలాంటి పరమార్థాలు ఉన్నాయనే లాజిక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో అంత పవర్ ఫుల్‌గా ఉన్న కేటీఆర్.. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయిన నాగార్జున, సురేష్ బాబు, మెగా ఫ్యామిలీ అందరూ.. కేటీఆర్‌తో సోషల్ మీడియాలో … ప్రైవేటు లైఫ్‌లోనూ టచ్‌లో ఉంటున్నారు. టాలీవుడ్‌కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా… అందరూ కేటీఆర్ దగ్గరకే వెళ్తున్నారు. కేటీఆర్ కూడా సానుకూలంగా పరిష్కరిస్తున్నారు. టాలీవుడ్‌ను కుదిపేసిన కొన్ని వ్యవహారాల్లో.. కేటీఆర్ సహకారంతోనే… చాలా మంది బయటపడ్డారన్న ప్రచారం ఉంది. తమకు అండగా ఉంటున్న కేటీఆర్‌కు మనస్ఫూర్తిగానే శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. దాని వెనుక తర్వాత వచ్చే అవసరాలు కూడా కలిపి ఉంటాయి.
మొన్న పుట్టిన రోజుకు మిస్సయ్యానని అనుకున్నారేమో కానీ… సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్… నిన్న కేటీఆర్‌కు పొగుడుతూ ఓ ట్వీట్ పెట్టారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఓ స్కూల్‌లో తరగతి గదులను..రైలు బోగీల తరహాలో నిర్మించారు. దీన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు దేవీశ్రీప్రసాద్.. ఉబ్బితబ్బిబ్బవుతూ రిప్లయ్ ఇచ్చారు. తనకు కూడా ఆ స్కూల్‌కి వెళ్లాలనిపిస్తోందనేశారు. మొత్తానికి ఇప్పుడు…సినిమా తారలందరూ.. ఫ్యాన్స్‌కి స్టార్లేమో కానీ.. ఈ స్టార్లకు మాత్రం సూపర్ స్టార్ కేటీఆర్.
Wowwwwww Thats amazing Dear Brother @KTRTRS !!! Inspiring !! ???????
No Kid wud like to Bunk this school !!!Even I feel like joining here now ! ???? https://t.co/Hcs7MVcox5
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 29, 2018
Many Thanks Rakul https://t.co/9Xes3tEh6E
— KTR (@KTRBRS) July 25, 2018
Your green challenge accepted @ssrajamouli Garu?
By the way, loved your buddy in the pic ? ? https://t.co/LOcqk2GtU9
— KTR (@KTRBRS) July 24, 2018
Are you saying I am not young anymore? ?Thanks Akhil ? https://t.co/WXCVWAv2Av
— KTR (@KTRBRS) July 24, 2018