పవన్‌కల్యాణ్ నుంచి వేరు పడ్డాక.. పవన్‌కి విడాకులు ఇచ్చాక.. ఏడెనిమిదేళ్లు రేణూ దేశాయ్ ఒంటరిగా వున్నారు. ఇన్నేళ్లూ పిల్లలు అకిరా నందన్, ఆద్య ఆమె వద్దే పెరిగారు. అప్పుడప్పుడూ పిల్లల వద్దకు పవన్ వెళ్లి వస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రేణూ దేశాయ్ మరో పెళ్లికి సిద్ధం అవుతుండటంతో పవన్ పిల్లలు ఎక్కడ వుంటారు? ఆమెకు కాబోయే భర్తతో కలుస్తారా? పిల్లల్ని అతను ప్రేమగా చూసుకుంటాడా? అనే ప్రశ్నలు కొంతమంది ప్రేక్షకుల్లో తలెత్తాయి. ఇటువంటి సందేహాలు రావడమూ సహజమే. ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూలో, ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కొన్ని సందేహాలకు రేణూ దేశాయ్ సమాధానం ఇచ్చారు. పిల్లలు ఇద్దరికీ తన పెళ్లి ఇష్టమేనని చెప్పారు. కాబోయే భర్తతో పిల్లలు స్నేహంగా వుంటున్నారని తాజా న్యూయార్క్ హాలిడే ట్రిప్ ద్వారా లోకానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం రేణూ దేశాయ్ న్యూయార్క్‌లో వున్నారు. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య(అఫ్కోర్స్ ఆమె పిల్లలు కూడా అనుకోండి. అయితే… పవన్ ద్వారా కలిగిన సంతానం కదా) ప్లస్ కాబోయే భర్తతో ట్రిప్‌కి వెళ్లారు. ఎప్పుడు హాలిడే ట్రిప్ వేసినా సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు రేణూ దేశాయ్. మధ్యమధ్యలో ఆమె ఫొటోలు తీసి, ఫొటోగ్రాఫ్ బై అకిరా లేదా ఆద్య అని కాప్షన్ ఇస్తారు. జస్ట్ ఫర్ ఎ చేంజ్… ఈసారి కొత్త కాప్షన్ కనిపించింది. “మిస్టర్ ఫియాన్సే కొన్ని అద్భుతమైన క్షణాలను కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నారు” అని! ఆ ఫొటోలో రేణూని హత్తుకున్న ఆద్య కనిపిస్తుంది. తనకు కాబోయే భర్తతో పిల్లలు సఖ్యతగా వుంటున్నారని చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్‌ని ఈ విధంగా వాడుకుంటున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే… తనకు కాబోయే భర్తతో, తన పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ విహారయాత్రకు వెళ్లారన్నమాట!!