యువీ క్రియేషన్స్ రంగంలోకి దిగడం వల్లే… `హ్యాపీ వెడ్డింగ్`కి కాస్తో కూస్తో… ప్రమోషన్లు దక్కాయి. యువీ క్రియేషన్స్సినిమా అంటే ఎంతో కొంత మేటర్ ఉంటుందిలే.. అనుకున్నారు సినీ జనాలు. కానీ ఆ అంచనాలు తప్పాయి. హ్యాపీ వెడ్డింగ్.. వసూళ్లు బాగా నిరాశ పరుస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ సొంతంగా ఈ సినిమాకి పెట్టుబడి పెట్టకపోయినా, ‘పాకెట్ సినిమా’ బ్యానర్‌పై ఆర్థికంగా అండగా నిలబడ్డారు. దీనంతటికీ కారణం.. ప్రభాస్ రికమెండేషనే అని తేలింది. ఎమ్మెస్ రాజుకీ, ప్రభాస్‌కీ మంచి అనుబంధం ఉంది. ప్రభాస్ కెరీర్లో ‘వర్షం’ ఓ మేలిమి మలుపు. ఆ సినిమా ఎమ్మెస్ రాజు సంస్థ నుంచే వచ్చింది. ‘పౌర్ణమి’కి కూడా ఆయన బాగా ఖర్చు పెట్టారు. ఎమ్మెస్ రాజు డౌన్ ఫాల్ ఆ సినిమాతోనే మొదలైంది. అందుకే రాజుగారంటే. . ప్రభాస్ కి కాస్త సాఫ్ట్ కార్నర్. తనయుడు సుమంత్ అశ్విన్‌కి ఓ హిట్ సినిమా ఇవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారాయన. ఎమ్మెస్ రాజు అడిగారన్న కారణంతోనే ఈ సినిమాకి యూవీకి లింకప్ చేశాడు ప్రభాస్. కేవలం ప్రభాస్ రికమెండేషన్ వల్లే ఈసినిమాని తీసుకొంది యూవీ. సినిమా చూశాక.. కాస్త డౌట్ వచ్చి, యూవీ పేరుతో కాకుండా, పాకెట్ సినిమా బ్యానర్‌పై ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఈ సినిమా బయటకు వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే.. ఎమ్మెస్ రాజుపై తనకున్న అభిమానాన్ని చూపించుకోవడానికి ప్రభాస్‌కి ఓ అవకాశం దక్కింది.