సుమంత్ అశ్విన్… ఓ అగ్ర నిర్మాత తనయుడు. బయటి నిర్మాతలెవరూ ముందుకు రాకపోయినా సినిమాలు తీసి, ఆడించుకోగల కెపాసిటీ ఉన్న నిర్మాత ఇంటి నుంచి వచ్చాడు. పైగా… ఆయనకున్న పరిచయాలు ఒకటా రెండా..? తనయుడి కోసం ఎవరినైనా సరే, రంగంలోకి దింగపలడు. అశ్విన్ కూడా అందంగానేఉంటాడు. టీనేజీ లవ్ స్టోరీలకు పక్కాగా సూటైపోతాడు. ఇప్పటి వరకూ ఎనిమిది సినిమాలు కూడా చేసేశాడు. కానీ ఏం లాభం…?? తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చూస్తే.. నటనలో అశ్విన్ ఇంకా ఎల్కేజీ స్థాయిలోనేఉన్నాడా అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశానికీ, ప్రతీ ఎమోషన్‌కీ ఒకే తరహా బాడీ లాంగ్వేజ్.. ప్రతీ డైలాగ్‌కి ముందు చిన్నగా నవ్వు.. ఎందుకో.. కెమెరా ముందు ఇంకా అసౌకర్యంగానే ఫీలవతున్నాడేమో అన్న డౌటు వస్తోంది. ‘అంతకు ముందు ఆ తరవాత’, ‘కేరింత’ లాంటి సినిమాల్లో అశ్విన్ చాలా సెటిల్డ్‌గా చేశాడు. కానీ.. ఆ పాఠాలు కూడా మర్చిపోయి బొత్తిగా కొత్త కుర్రాడిలా కనిపించడం విస్మయానికి గురి చేసింది. ఎమ్మెస్ రాజు ఇప్పటికీ తనయుడి కోసం సినిమాలు చేయలగరు. మంచి దర్శకుల్ని, క్రేజీ కాంబినేషన్లనీ సెట్ చేయగలడు. అశ్విన్ కోసం కొత్త దర్శకులు కథలు సిద్ధం చేయగలరు.. కానీ.. అశ్విన్ మాత్రం ఇప్పటికీ ఓనమాల స్థాయిలోనే ఉంటే ఎలా..?? ముందు తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ వైపు కూడా అశ్విన్ దృష్టి పెట్టాలి. ఆ తరవాతే మంచి కథల్ని ఎంచుకోవాలనిపిస్తోంది.