ఈవారం విడుదలైన సినిమాల్లో ‘హ్యాపీ వెడ్డింగ్’ ఒకటి. ప్రోమోలు బాగుండడం, నిహారిక కథానాయిక కావడం, యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యం ఉండడంతో ఈ సినిమాపై ఫోకస్ పడింది. కానీ ఆ అంచనాల్ని మాత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’ అందుకోలేకపోయింది. నిహారిక కోసమైనా ఓపెనింగ్స్ రాలేదు. అయితే.. ‘హ్యాపీ వెడ్డింగ్’ మాత్రం సోమ్ములు చేసేసుకుంది. డిజిటల్, శాటిలైట్ రూపంలో దాదాపుగా రూ.3 కోట్లు వచ్చాయని సమాచారం. థియేటర్ అడ్వాన్సుల రూపంలో మరో కోటి దక్కాయట. ప్రమోషన్లలో కలసి రూ.3 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని ఆ లెక్కన చూస్తే.. `హ్యాపీ వెడ్డింగ్` ఒడ్డున పడిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఎమ్మెస్ రాజు కూడా యూవీ క్రియేషన్స్ అండ దండ కోరుకున్నది కూడా ఇందుకే. ఈ సినిమా వాళ్ల చేతుల్లో పడిన తరవాతే.. శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. మొత్తానికి… ఫ్లాప్ అయినా.. నిర్మాతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారు. మార్కెట్ స్ట్రాటజీ అంటే అలానే ఉండాలి.