మెగా ఇంటి నుంచి ఎంతోమంది హీరోలొచ్చారు. వాళ్లలో స్టార్లున్నారు, ఓ రేంజు మార్కెట్ సృష్టించుకున్న మీడియం స్థాయి నటులున్నారు. ఎవరి దారి వాళ్లదే. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ సినిమాలున్నాయి. మెగా ట్యాగ్ వాళ్ల పాలిట వరంగా మారింది. అదే ఇంటి నుంచి వచ్చింది నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన తొలి కథానాయికగా ఆమెపై ఫోకస్ పడింది. ఆమె ఎలాంటి సినిమాలు చేస్తుందో, ఎంత మార్కెట్ సృష్టించుకుంటుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఒక మనసు డిజాస్టర్ అయినా… నటిగా ఓకే అనిపించుకుంది. ఇప్పుడు `హ్యాపీ వెడ్డింగ్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదీ ఫ్లాపే. `మెగా కథానాయిక` అనే బ్రాండ్ కూడా ఏమాత్రం పనిచేయలేదనడానికి వచ్చిన వసూళ్లే సాక్ష్యం. అటు ఒక మనసుకి గానీ, ఇప్పుడు `హ్యాపీ వెడ్డింగ్`కి గానీ ఓపెనింగ్స్ ఏమాత్రం బాలేదు. నిహారిక గొప్ప నటేం కాదు. తన పాత్ర వరకూ చూసుకుంటే సహజంగా నటిస్తూ మంచి మార్కులే తెచ్చుకుంటున్నా, ఆ మాత్రం నటించే వాళ్లు తెలుగు ఇండ్రస్ట్రీలో దొరక్కపోరు. మెగా హీరోయిన్ని తీసుకుంటే, పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని, ఓపెనింగ్స్ వస్తాయన్నది నిర్మాతల ఆశ. ఆ విషయంలో రెండు సినిమాలూ ఫెయిల్ అయ్యాయి. ఇక నిహారికను ఏ నమ్మకంతో అవకాశాలు వరిస్తాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అందులోనూ పెద్దగా స్టార్ గణం లేదు. నిహారికే స్పెషలాఫ్ అట్రాక్షన్. ఆ సినిమా కూడా అటూ ఇటూ అయితే… నిహారిక ఇక వెబ్ సిరీస్లు చేసుకోవాలేమో. కథల ఎంపికలో నిహారిక మరింత జాగ్రత్తగా ఉంటే తప్ప… ఈ గండం నుంచి గట్టెక్కదేమో.