అతిలోక సుందరి శ్రీదేవి.. అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు. ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాల్నీ దక్కించుకుంది. శ్రీదేవి వారసత్వం పుణికి పుచ్చుకుని కథానాయికగా అడుగుపెట్టిన జాన్వి.. తొలి సినిమాతోనే అవార్డు కొట్టేసింది. వోగ్ మ్యాగజైన్ ఈ యేడాది ఫ్రెష్ ఫేస్ అవార్డుని జాన్వికి అందజేసింది. జాన్వి తొలి చిత్రం ధడక్ ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపిస్తోంది. జాన్వి నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కీ మంచి మార్కులు పడుతున్నాయి. ఈలోగా… ఓ పురస్కారం తన చేతికొచ్చేసింది. తొలి సినిమాతోనే.. జాన్వి ఓ అవార్డు దక్కించుకోవడం, తాను చేసిన తొలి సినిమానే బాక్సాఫీసు హిట్టుగా నిలవడంతో మంచి ఆరంభం లభించినట్టైంది. జాన్విని కథానాయికగా చూసుకోవాలని శ్రీదేవి ఆశ. అది తీరే సమయానికి… శ్రీదేవి ఈ లోకంలో లేకుండా పోయింది. తల్లి మరణంతో కృంగిపోయిన జాన్వికి ఈ విజయాలే ఊరట.