ఈమధ్య చిన్న సినిమాల్లో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’. వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు నాగ్ కితాబు అందుకుంది. ఈ సినిమాలో చివరి రెండు రీళ్లూ చూసిన నాగ్ ఆర్.ఎక్స్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ”సినిమా మొత్తం చూళ్లేదు గానీ, క్లైమాక్స్ చూశా. చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం సినిమా చూడాలనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో చూస్తా. ఈ సినిమా గురించి రకరకాల కామెంట్లు విన్నాను. అడల్ట్ సినిమా అని, ఏ సర్టిఫికెట్ సినిమా అని అన్నారు. కానీ.. అన్ని రకాల సినిమాలూ వస్తుండాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. సినిమాలో నిజాయతీ కనిపించింది. మరీ ముఖ్యంగా రైటింగ్, టెక్నికల్ డిపార్ట్మెంట్లు చాలా బాగా పనిశాయి” అని పొగడ్తలతో ముంచెత్తాడు నాగ్. ఆయన దృష్టిలో ఓ సినిమా పడిందంటే… ఆ దర్శకుడికో, హీరోయిన్ కో అన్నపూర్ణ సంస్థ నుంచి పిలుపు రావడం ఖాయం. మరి ఈ రెండింటిలో ఏం జరుగుతుందో చూడాలి.