జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటు హక్కు హైదరాబాద్ పరిధిలో ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓటరు. జనసేన పార్టీ పెట్టి… ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రాజకీయాలు చేయాలనుకున్న తర్వాత కూడా ఆయన ఓటును ఏపీకి మార్పించుకోలేదు. కొద్ది రోజుల క్రితం… విజయవాడలో అమరావతిని ఆపేస్తామన్న గంభీరమైన ప్రకటన తర్వాత… నెటిజన్లు పవన్ కల్యాణ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఓటరైన పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని ఆపడేమిటని విమర్శలు ప్రారంభించారు. సాక్ష్యంగా.. ఖైతరాబాద్ నియోజకవర్గ పరిధిలో పవన్ కల్యాణ్ ఓటర్‌గా ఉన్నట్లుగా… ఈసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని బయపెట్టారు. ఇది వైరల్ అయ్యి.. అవగానే… పవన్ కల్యాణ్…ఏలూరులో ఓటర్‌గా నమోదు చేయించుకున్నారు.
ఏలూరు శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. దానికి పవన్ కల్యాణ్, జనసేన అధినేత అనే నేమ్ బోర్డును వేలాడ దీశారు. చిరునామా ధృవీకరణ కావాలి కాబట్టి… రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని అడ్రస్ ఫ్రూఫ్‌గా చూపించి ఆన్లైన్ లో ఓటర్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు కూడా మంజూరు చేశారు. అంటే అధికారికంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏలూరు నియోజకవర్గపరిధిలోని ఓటరు. దీంతో అక్కడి నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. కానీ జనసేన వర్గాలు మాత్రం.. గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.. పవన్ కల్యాణ్‌కు కూడా తెలియదు కాబట్టి.
అంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు… అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు… అదే మాట చెప్పారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఏలూరులో ఓటు నమోదు చేయించుకోవడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ అంచనాకు వస్తున్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాతో.. మెగా ఫ్యామిలీకి రాజకీయంగా అంత గొప్ప గురుతులు ఏమీ లేవు. పాలకొల్లు నుంచి చిరంజీవి ఘోరపరాజయం.. ఇప్పటికీ వెంటాడుతోంది. ఇప్పుడు పవన్ ఏలూరుంటే.. అదే రిపీట్ అయితే ఇబ్బందేనన్న ప్రచారం జరుగుతోంది.