ప్రకాష్‌రాజ్ గొప్ప నటుడు, ప్రకాష్‌రాజ్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రకాష్‌రాజ్ వెర్సటైల్ ఆర్టిస్ట్.. ఇవీ ప్రకాష్‌రాజ్ గురించి అందరూ చెప్పే మాటలు. సినిమా వరకు అతన్ని ఇలా పొగడడంలో తప్పులేదు. ఆర్టిస్ట్‌కి టాలెంట్‌తోపాటు డిసిప్లిన్, బిహేవియర్ కూడా చాలా ముఖ్యమని పాపం ప్రకాష్‌రాజ్‌కి తెలీదు. అతనికి అదే పెద్ద మైనస్. అతని చేష్టల వల్ల ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బందులు పడ్డారనేది అందరికీ తెలుసు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆఖరికి ప్రొడక్షన్ బాయ్ కూడా అతని బాధితుడే. అయినా మన దర్శకనిర్మాతలు అతన్నే పట్టుకొని వేలాడతారు. అంతకంటే గొప్ప ఆర్టిస్టు తెలుగులో లేడని వారి ఫీలింగ్. అతన్ని మించిన నటులు తెలుగులో వున్నా.. వారికి అవకాశాలు ఇవ్వకపోవడంవల్లే ప్రకాష్‌రాజ్‌కి అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నిజానికి సెట్‌లో కనిపించే ప్రకాష్‌రాజ్ వేరు అని యూనిట్ సభ్యులు చెప్తుంటారు. అతను చేసిన ‘అతి’ వల్ల గతంలో రెండు సార్లు తెలుగు చిత్ర పరిశ్రమ అతన్ని వెలివేసింది. అన్ని భాషల కంటే తెలుగులోనే అతనికి ఎక్కువ ఫాలోయింగ్ వుంది కాబట్టి బ్యాన్ అయిన రెండు సార్లూ ‘ఏదోవిధంగా’ మళ్ళీ వచ్చి చేరాడు. ఎన్ని జరిగినా కుక్క తోక వంకర అన్నట్టుగా అతని బుద్ధి మాత్రం మారడం లేదు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రకాష్‌రాజ్‌కి మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడంతోపాటు మంచి సినిమా తీసి గొప్ప డైరెక్టర్ అనిపించుకోవాలన్న ‘ఇది’ కూడా వుంది. ఆ ‘ఇది’తోనే ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ‘మన ఊరి రామాయణం’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి మనవాడు డబ్బింగ్ ఆర్టిస్టులపైన విరుచుకుపడడం మొదలెట్టాడట. డబ్బింగ్ ఎలా చెప్పాలి అనే విషయం మీద సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా క్లాస్ పీకుతున్నాడట. ఇతని ఓవర్ యాక్షన్ తట్టుకోలేక కొంతమంది డబ్బింగ్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారట. ఇదంతా చూసి విసుగెత్తిన యూనిట్ మెంబర్స్ ఇలా అయితే ఎప్పటికి డబ్బింగ్ పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అర్థంకాక తల పట్టుకొని కూర్చున్నారట.