వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో రెండు ప్రైవేటు బిల్లులు పెట్టారు. ఏపీలో ఉద్ధృతంగా కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా, విభజన హామీలు, రైల్వేజోన్ .. ఇలాంటి వాటిపై కాదు.. ఆ ప్రైవేటు బిల్లులు. ఎవరూ ఊహించని బిల్లులు అవి. నేరుగా భారతదేశ సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని గురి పెట్టి పెట్టిన బిల్లులు అవి. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించాలట. దీన కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సవరణ చేయాలట. ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం అనే పదం వల్ల .. ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తున్నాయట. ఇంకొకటి.. లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించేందుకు క్రిమినల్ లా లోని 497 సెక్షన్ను సవరించాలన్న బిల్లు.
విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లులు చూసి.. అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఓ వైపు లోక్సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి.. వెళ్లిపోయారు. పార్లమెంట్ లో మిగిలిన ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు ..ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రస్తావించకుండా.. అసలు సంబంధమే లేని.. ప్రజల్లో ఎలాంటి చర్చా .. జరగని.. అంశాలతో ప్రైవేటు బిల్లులు పెట్టడం వెనుక కారణమేమిటన్నదానిపై ఇతర ఎంపీల్లో చర్చల్లో ప్రారంభమయ్యాయి. ఓ వైపు టీడీపీ ఎంపీలు.. కాపు రిజర్వేషన్ల అంశంపై…. అటు లోక్ సభతో పాటు.. ఇటు రాజ్యసభలోనూ ప్రైవేటు మెంబర్ బిల్లులు పెట్టారు. చివరికి కేవీపీ కూడా… విభజన హామీలపై ప్రైవేటు మెంబర్ బిల్లులు ఇచ్చారు. కానీ విజసాయిరెడ్డి మాత్రం అనూహ్యంగా సంబంధం లేని అంశాలతో ముందుకెళ్లారు.
పైగా విజయసాయిరెడ్డి.. నేరుగా భారతదేశ సమగ్రత, సౌర్వభౌమత్వాన్నే గురి పెట్టారు. అసలు ఆ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి… భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వం ఏమి అడ్డం వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి ఆయన చెప్పిన కారణం ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తున్నాయనడం. అంతగా విజయసాయి ప్రాథమిక హక్కులను ఏం కోల్పోయారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల కాలంలో.. టీటీడీపై విపరీతమైన ఆరోపణలు చేయడంతో.. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు.తాను అలా ఆరోపించడంపై అబ్జెక్షన్ చెప్పడమే.. విజయసాయి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లు భావిస్తున్నారులా ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లులు చర్చకు వస్తాయో రావో కానీ… ఆయన బిల్లులు మాత్రం.. హాట్ టాపిక్ అవుతున్నాయి.