హైదరాబాద్: తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మలేషియాలోని ఫెనాంగ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింధు 21-15, 21-09 తేడాతో స్కాట్లాండ్కు చెందిన క్రిస్టీ గిల్మౌర్‌పై గెలిచి టైటిల్‌ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న సింధు ఫైనల్లో కూడా అదే స్థాయిలో ప్రతిభను కనబరచి ట్రోఫీని కైవసం చేసుకుంది. 32 నిమిషాల్లో వరస సెట్లను గెలిచిన సింధుకు క్రిస్టీనుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురవలేదు. మొదటి గేమ్‌లో కాస్త పోరాడిన క్రిస్టీ రెండో గేమ్‌లో సింధు ధాటికి పూర్తిగా తలవంచి రన్నర్ అప్‌గా మిగిలిపోయింది. సింధు బాడ్మింటన్ కెరీర్లో ఇది ఐదో గ్రాండ్ ప్రీ టైటిల్ కాగా, మలేషియన్ ఓపెన్ గెలవటం రెండోసారి. అంతకుముందు 2013లో సింధు మలేషియన్ ఓపెన్ గెలిచింది.