కమల్ గొప్ప నటుడు. దాంతో పాటు రొమాంటిక్ కింగ్ కూడా. దక్షిణాదిన చూడలమా? అనుకునే చాలారకాల ముద్దుల్ని వెండి తెరపైకి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. హే రామ్ లో కమల్ పెట్టుకున్న ముద్దులు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కమల్ ఏ కథానాయికనీ వదిలిపెట్టడని, ముద్దులు తప్పకుండా ఉంటాయని సినీ జనాలు కూడా తప్పకుండా నమ్ముతారు. ‘విశ్వరూపం 2 ‘లోనూ అలాంటి ముద్దులు చూసే అవకాశం ఉంది. ‘విశ్వరూపం 1’ పూర్తిగా యాక్షన్‌కే పరిమితమైంది. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇవేం లేవు. అయితే పార్ట్ 2లో మాత్రం వాటికి చోటిచ్చాడట కమల్. ఇందులో కమల్ మార్కు ఘాటైన ముద్దులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయంలో కమల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. ”తొలిభాగం మొత్తం యాక్షన్‌కే పరిమితమైంది. లవ్ ట్రాక్ లేదు. కానీ పార్ట్ 2లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది. కథ చెబుతూనే లవ్, రొమాన్స్ రెండూ చూపిస్తాం” అంటున్నాడు కమల్. ఇటీవల విడుదలైన కొత్త పోస్టర్లు చూస్తుంటే.. విశ్వరూపం 2 కేవలం యాక్షన్‌కే పరిమితం కాదన్న సంగతి అర్థమవుతోంది. మరి ఈసారి కమల్ ఏ రేంజులో విజృంభిస్తాడో చూడాలి.