ట్రాల్స్ దెబ్బకు ‘గీత గోవిందం’లో ‘వాట్ ద ఎఫ్’ సాంగ్ లిరిక్స్ చేంజ్ చేయవలసి వచ్చింది. ‘ఎఫ్’ తీసేసి, దానికి బదులు ‘లైఫ్’ అని రాశారు. ఇంటర్నెట్లో యూత్‌కి విజయ్ దేవరకొండ విలన్‌గా కనిపించాడు. పాట పాడటమే అతను చేసిన నేరం కింద ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. ట్రాల్స్ ఎఫెక్ట్ హీరో మీద ఎంత ప్రభావం చూపిందనేది చెప్పడానికి ‘గీత గోవిందం’ ఆడియో ఒక ఉదాహరణ. ‘రెండు రోజులు నన్ను ఆడేసుకున్నారు. క్షమించడబ్బా’ అని విజయ్ దేవరకొండ సభాముఖంగా వేడుకున్నాడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే… ‘గీత గోవిందం’ హీరోయిన్ రష్మిక మండన్న మీద కూడా ట్రాల్స్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది. అయితే… అతడిలా క్షమించమని కాకుండా కొంచెం ఘాటుగా స్పందించింది.
కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికకు ఎంగేజ్మెంట్ జరిగింది. అదీ తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందు. లేటెస్టుగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది. దీన్ని ఖండించడానికి రష్మిక సోషల్ మీడియాలోని అభిమానులతో లైవ్‌లో ముచ్చటించింది. చాలామంది ‘గీత గోవిందం’లోని ఓ పాట పాడమని అడిగారు. అడిగిన ప్రతిసారీ “నాది చాలా బ్యాడ్ వాయిస్. నేను పాడితే తట్టుకోలేరు. వద్దు” అని చెప్పింది. ఈ సినిమాలో ఒక పోస్టర్లో హీరోయిన్ని హీరో మోస్తుంటాడు. “అసభ్యంగా హీరో వెనుక ఎక్కి అలా పట్టుకోవడమేంటి?” అని కామెంట్ చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రష్మిక కామెంట్ చేసిందో? మరొకటో? ట్రాల్స్ గురించి మీ రియాక్షన్ ఏంటి? అని అడిగితే గీత గోవిందం’ ట్రైలర్లో ఆమె చెప్పిన డైలాగ్‌ని కాస్త మార్చి చెప్పింది. “ట్రాల్స్ చేసేవారందరూ ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని వెంటపడితే యాసిడ్ పోసేస్తా” అని చెప్పింది. ట్రాల్స్ ఎఫెక్ట్ గట్టిగా వుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అనుకోవాలి.