భారతదేశంలో చాలా కాలం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. గతంలో ఉన్న విధానం కన్నా… ఇది మరింత ప్రయోజనకరమైనది. ఎందుకంటే.. దీన్ని ట్యాంపరింగ్ చేయడం అంత సులభం కాదు. బ్యాలెట్ బాక్సులున్న రోజుల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం చూశాం. ఇప్పుడు ఈవీఎలల వల్ల బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ అనేది దాదాపుగా అసాధ్యం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లతో ఎన్నికల ప్రక్రియ కూడా చాలా సులభతరం అవుతోది.
ఈవీఎంల ట్యాంపరింగ్ అంత సులువు కాదు..!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు.. ఓ సెంట్రలైజ్డ్ నెట్ వర్క్ కాదు కాబట్టి… ఓ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం యూనిట్‌గా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. అయితే స్థానికంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చా అనేది చాలా మందిలో వస్తున్న అనుమానం. ఇందులో మరో ముఖ్య విశేషం ఏమింటే..అభ్యర్థులు..వారి గుర్తులు. బరిలో ఎంత మంది అభ్యర్థులుంటారు.. వారికి ఏ గుర్తులు ఉంటాయో చివరి నిమిషంలో నే తెలుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే.. బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది అప్పుడే తెలుతుంది. ఈ తేదీకి.. ఓటింగ్ తేదీకి మధ్య చాలా తక్కువ సమయం ఉంటుంది. అందు వల్ల ట్యాంపరింగ్ జరగాలన్నా… పెద్ద ఎత్తున అనేక స్థాయిల్లో కల్పించుకోవాలి. ఒకరో.. ఇద్దరో అధికారులు కల్పించుకుంటే అయ్యేది కాదు. అందువల్ల పెద్ద ఎత్తున.. అనేక మంది అధికారులు… కలిసి చేస్తే తప్ప.. ఈవీఎంలు ట్యాంపరింగ్ కావు. ఇలా ట్యాంపరింగ్ చేయడం అంత సులభం కాదు.
ట్యాంపర్ చేయలేనంత టెక్నాలజీ కూడా లేదు..!
మన దేశంలో రాజకీయ నాయకులకు ఉన్న అలవాటు ఏమిటంటే.. ఓడిపోయినప్పుడల్లా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటారు. గెలిచినప్పుడు మాత్రం మాట్లాడరు. ఈ రకమైన వైఖరి తీసుకోవడం సరైంది కాదు. అదే సమయంలో.. ఈవీఎంలపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా వంద శాతం ట్యాంపరింగ్ ఫ్రూఫ్ ఉంటుందా అని చెప్పలేం. ఆధార్ విషయంలోనే చూశాం. ఆధార్ పై ట్యాంపరింగ్ ఉండదనుకున్నాం. కానీ ఆధార్ విషయాలన్ని చాలా సులువుగా ట్యాంపర్ అవుతున్నాయి.
ఈవీఎంలపై అనుమానాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..!
అదే సమయంలో… టెక్నికల్‌గా ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లోకి వస్తే.. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్లు పూర్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. ఓటింగ్ ప్రక్రియపైన ఓటర్లకు పూర్తి విశ్వాసం ఉండాలి. అందువల్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా..? చేయగలుగుతారా..? ఏ స్థాయిలో ట్యాంపరింగ్ చేయగలుగుతారు..? అనే విషయాలతో సంబంధం లేకుండా… ఓటింగ్ ప్రక్రియపై.. అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి కనుక.. ఓటర్లలో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలి. ఇటీవలి కాలంలో ఈవీఎంలకు వీవీ పాట్ మిషన్లను అమర్చుతున్నారు. ఈ మెషిన్ల వల్ల ఉపయోగం చాలా ఉంది. ఓటర్ ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశారో… నిర్దారిస్తూ ఓ స్లిప్ వస్తుంది. అవసరం అయితే.. ఈవీ పాట్ మిషన్లలో రికార్డయిన .. ఓట్లను.. ఈవీఎంలలో రికార్డయిన వాటితో ట్యాలీ చేయవచ్చు.
వీవీ పాట్ మిషన్ల అనుసంధానం విషయంలో ఆలస్యం ఎందుకు..?
ఎక్కడైనా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయన్న అనుమానం వస్తే.. అప్పుడు ఈ పేపర్ ట్రయల్స్ ను కూడా లెక్కించవచ్చు. అప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేశారో లేదో తెలిసిపోతుంది. అంతే కాక.. ఓటర్ తన ఎవరికి ఓటు వేశాడో.. తన ఓటును తాను చూసుకుంటాడు కాబట్టి.. వారిలో నమ్మకం కూడా పెరుగుతుంది. 2013లోనే సుప్రీంకోర్టు ప్రతి ఈవీఎంకు.. వీవీ పాట్ మిషన్లు అమర్చాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అమర్చలేకపోయారు. ఇప్పటికీ.. పూర్తి స్థాయిలో అమర్చడానికి ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. అన్ని ఈవీఎంలకు వీవీ పాట్ మిషన్లు అమర్చాలంటే.. రూ. 3100 కోట్లు ఖర్చు అవుతుందని ఈసీ చెబుతోంది. వాస్తవంగా.. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరగడానికి.. ఈవీఎంలు ట్యాంపర్ కావడం లేదని నిరూపించడానికి… ఇది పెద్ద ఖర్చు కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరగేలా చేయడానికి ప్రభుత్వం రూ. 3100 కోట్లు ఇవ్వలేదా..?
ఓటర్లకు ఈవీఎంలపై విశ్వాసాన్ని పెంచాలి..!
కేంద్ర ప్రభుత్వం వీవీ పాట్ మిషన్ల విషయంలో ఈసీకి సహకరించకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. కేంద్రం.. వెంటనే.. నిర్ణయం తీసుకుని.. మూడు వేలు కాదు..నాలుగు వేల కోట్లు ఇచ్చి అయినా సరే ప్రతి ఈవీఎంలకు వీవీ పాట్ మిషన్లను అమర్చమని ఆదేశిస్తే.. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఒకరు చేయవచ్చని.. ఇంకొకరు చేయకూడదని..మొదలు పెడితే.. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పోతుంది. అందుకే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంగా.. కచ్చితంగా వీవీపాట్ మిషన్లను ప్రతి ఈవీఎంకు అమర్చాలి. ఈవీఎంను ఎవరైనా…సాఫ్ట్ వేర్ని అయినా.. హార్డ్ వేర్ని అయినా ఓపెన్‌గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా ఓటర్లకు విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంది. ప్రభుత్వంపై ఉంటుంది.