ఏ సినిమాకైనా ప్రమోషన్లు చాలా అవసరం. మంచి సినిమాలు కూడా కొన్ని సార్లు ప్రమోషన్లు లేక చతికిలపడుతుంటాయి. ‘ఛలో’ విజయంలో ప్రమోషన్లు కీలక పాత్ర పోషించాయి. అంత వరకూ నాగశౌర్య సినిమాలకు దక్కని పబ్లిసిటీ ‘ఛలో’కి దక్కింది. అది సొంత సినిమా కాబట్టి…పబ్లిసిటీ అంతా నాగశౌర్య చేతిలో ఉంది. ఇప్పుడు ‘నర్తనశాల’కు అంతకు మించి ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటని వర్జీనియాలో ఆవిష్కరించారు. ‘ఛలో’కి ఓవర్సీస్లో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే యూఎస్‌లో మాత్రం ప్రమోషన్లు చేయలేకపోయారు. ఆలోటు తీర్చడానికి ఇప్పుడు వర్జీనియాలో అడుగుపెట్టాడు నాగశౌర్య. అక్కడి అభిమానులతో కాసేపు గడిపాడు. ‘నర్తనశాల’ విడుదలకు ఇంకా టైమ్ ఉంది. కాకపోతే… ప్రమోషన్లు నెల రోజుల ముందు నుంచీ మొదలెట్టేశారు. ‘ఛలో’ బ్రాండ్ నర్తనశాలపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభవసూళ్లకీ ఢోకా లేదు. అందుకే… ఈ స్థాయిలో ప్రమోషన్లు జరిపిస్తున్నారు.