సమ్మర్ తెలుగు సినిమాల పోరు స్టార్ట్ అవ్వకముందే ఆయా సినిమాలకు సంబంధించిన చర్చలు అప్పుడే మొదలైపోయాయి. ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సక్సెస్ అవ్వడానికి ఏ సినిమాకి ఎంత ఛాన్స్ వుంది అనే లెక్కలు వేయడంలో బిజీ అయిపోయాయి సినీ వర్గాలు. ఏప్రిల్, మేలలో బ్రహ్మూెత్సవం, సర్దార్ గబ్బర్‌సింగ్, సరైనోడు, అఆ, ఊపిరి.. ఇలా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ సినిమాల మధ్య సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ కూడా వచ్చి చేరింది. అది కూడా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కి పోటీగా ‘కబాలి’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు దర్శకనిర్మాతలు.
సాధారణంగా పవన్‌కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత ఒక వారం ముందుగానీ, ఒక వారం తర్వాత గానీ ఏ సినిమానీ రిలీజ్ చేసే ధైర్యం చెయ్యరు. అలాంటిది ‘కబాలి’ నిర్మాత మాత్రం పవన్‌కళ్యాణ్ సినిమాకి పోటీగానే తమ సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ‘కబాలి’ చిత్రాన్ని మేలో రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేసిన నిర్మాత కలైపులి ఎస్.థాను ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్‌కి వారం ముందుగానీ, వారం తర్వాతగానీ రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. దీన్ని బట్టి సమ్మర్లో ఎన్నో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నా మెయిన్ పోటీ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కబాలి’ చిత్రాల మధ్యే వుంటుందని తెలుస్తోంది. మరి ఎవరి సినిమా ఎలా వుంటుందో తెలుసుకోవడానికి సమ్మర్ వరకూ ఆగుదాం.